Thursday, September 10, 2020

           
          దారి తప్పిన(రాజకీయా)ఉదారత 

దేశం కోసం వారి ప్రాణాలు కూడా లెక్క చెయ్యని రాజులు ,రాణులు  మరియు సాధారణ వ్యక్తులు  ఎంతో మంది వారి ప్రాణాల త్యాగ ఫలమే ,ఈ నాటి స్వాతంత్రం  . దానికి ఒక అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ ,సుభాష్ చంద్ర బోస్ వంటి ఎంతో మంది పుణ్య పురుషుల త్యాగబలం  
వల్లా ,ఇది సాధ్యం అయింది. కానీ వీరి యొక్క వారసులు రాజకీయాలలో ఎవ్వరు లేరు ,ఎందుకు ?
వారసులు లేకనా? రాలేకనా? వారికీ రాజకీయాల పై  ఇష్టం లేక మాత్రమే ..... 
ఇక్కడే మొదటి తప్పు జరిగింది ,అది  ఎందరో త్యాగ ధనుల ప్రాణాల ,కష్టాల ఫలం వృధా అవ్వటం మొదలవడం మొదలు పెట్టింది , వారే వారసత్వ రాజకీయాలకు పునాది రాళ్లు ,వేసుంటే  మన దేశం ఇంకోరకంగా ఉండేదేమో ? గాంధీలకు  ,నెహ్రు లకు తేడా ఉందని తెలుసుకొనే వరకు  ఇది ఇలానే కొనసాగుతుంది .   
 కారణం విదేశి వ్యక్తల చేతులలో మన రాజ్యాంగాన్ని,దేశాన్ని ఉంచటమే ఓక పెద్ద తప్పిదం. 
దానికి వివిధ కారణాలు అయినప్పటికీ ,మూల్యం ప్రజల0 చెల్లించుకుంటున్నాం,కానీ ఇప్పటికి మనం ఇంకా పాత తరం రాజకీయాలను పట్టుకొని వేలాడుతుంటే మన బ్రతుకులు ఇంతే , 
అయినా సరే మనం ఇంతే అయితే మన బ్రతుకులతో పాటు , మన పిల్లల బ్రతుకులు కూడా 
ఇంతే ఉంటుంది . అయితే ఇక్కడ ఎప్పుడు రాజకీయాలను విమర్శించుకుంటూ పోతే లాభం 
లేదు అని నా నమ్మకం , మరి మార్పు ఎక్కడ  రావాలి , మనలో మార్పు ముందుగా రావాలి ,
దానికి గాను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు మరి .అవి  

కష్టాన్ని నమ్ముకోవాలి , నిబ్బరంగా ఉండాలి , నాయకున్ని మన మధ్యలోని వారిని  
ఎన్నుకోవాలి, మన నాయకునికి పేదవాని కష్టాలు అన్ని తెలిసి ,అనుభవించిన వాడు కావలి ,
తనకి కారు ,బంగ్లా  వంటి వ్యామోహంలు  ఉండ కూడదు,కానీ కష్టం విలువ తెలిసి ఉండాలి 
మనలో ఒకడు , మన వాడు అవుతాడు కానీ , మనం ఇక్కడ ,తాను పట్నం వాసి అయితే  మనకు లాభం ఏమి ఉండదు . పట్టణానికి మనకు ఎంత దూరమో ,తనకి మనకి కూడా అంతే దూరం పెరుగుతుంది   కదా !

వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలి మరి ,అయితే ఒక మెట్టు మనం ముందుకు పోయినట్టుగా 
ఉంటుంది ,తన తాతలు ఏదో చేసారని మనం ఊడిగం చెయ్యాల్సిన అవసరం లేదు ,  ఉదాహరణకు : ఈ మధ్య సర్పంచ్ పదవులకు ,వారి కారిక్రమాలకు వారి వారి భర్తలు హాజరు అవడం జరుగుతుందని ,ప్రజా గ్రామా సభలో వారి వారి భర్తలను ప్రజలను నిలతీయ్యటం జరిగింది , అయితే ఇది ఒకందుకు మంచిదే కానీ , ఈ నిలతీయ్యటం అనేది ఒక రోజు  అంటూ   ఆగిపోకూడదు ,ఇది ఇలా క్రింది స్థాయి నుండి పై స్థాయి కి విస్తరించాలి , ప్రతి ప్రజా నాయకుడు 
అందరికి అందుబాటులో ఉండి తీరాలి , ఇది కదా న్యాయం . 

ప్రజా నాయకులూ సాధారణ జన జీవనం గడపలేరా , లేక పోతే ఎందుకు జరిగింది ఆలా ఏమి 
చేసారని ఇంత గట్టి భద్రత , దానికి అయ్యే ఖర్చు ఎవ్వరు భరించాలి మరి ? ఎంత భరించాలి మనం ? ప్రతి రాజకీయా నాయకుడికి శత్రువులు ఉంటారా ? ఉంటె దేనివల్ల వారికి శత్రువులు 
ఉన్నారని ఆలోచన చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది . అయితే  మాజీ పాత తరం  ప్రజా  నాయకులకు ఇప్పటికి కనీస సౌకర్యాలు లేవని  ఎంత మందికి తెలిసు ? కనీసం స్వంత ఇల్లు ,కారు  వంటివి  వారికి ఇప్పటికి లేవని తెలుసుకోవాలి ?   వారు కేవలం వారికి వచ్చే పెన్షన్ మీదనే 
ఆధార పడి జీవిస్తున్నారు ! వారిని చూసి నేర్చుకోరా ? మరి మన నాయకులూ !
అయ్యో ఎన్నిమార్లు పోటీచేసిన ఓటమి చెందాడని ,మనం(జాలితో ) ఓటు వేస్తే వారు మన నెత్తిన 
కూర్చుంటారు , సాధారణ వ్యక్తి ఉన్నజాలి,కరుణ  ప్రభుత్వ ఉద్యోగికి గాని , ప్రజా నాయకునికి గాని 
ఉండవని గమనించాలి , మనం ఓటు వేసి గెలిచినా నాయకుడు మనల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడని మన ఆలోచన ,కానీ తాను మన నెత్తిన కూర్చుంటాడని మనకు తెలియదు కదా !
తెలిసిన , మారక పోతాడా ? అని ఆశా ? కానీ ఎండమావి ఎప్పడికి ,చల్లటి నీటిని ఇవ్వలేదని తెలుసుకో లేక పోతున్నాం కదా !





No comments:

Post a Comment