Thursday, May 27, 2010

రాజకియ్య నీలి నీడలు

raajakiyya neeli needalu
స్వాతంత్ర సమరంలో ఎందరో మహా మహులు ప్రాణాలు అర్పించి ,వారి భందువులను ,ఆస్తులను ,ఆప్తులను పణంగా పెట్టి సాధించిపెట్టిన ఈ స్వారాజ్యం స్వార్థ రాజకియ్యాల మూలంగా బ్రస్టు పట్టిపోవడం భాధాకరం . నేడు పదవి ఒక హోదా ,ఒక పరపతి వియ్యాలవారికి చెప్పుకోవడానికి చుట్టుంగారక్షకులను నిల్చోపెట్టుకున్ట్టే అదోగోప్ప గర్వం ఈది ఒక రకమైన "ఈగో" గా వ్యసనమైపోయింది . పాలనా పార్టి కి మద్దతు అంటూనే ,ఉపసంహరణ అంటూ అదేరోజు ప్రకటన రావటం వింతగా ఉంటుంది .చూసేవాళ్ళకి లేదా ,చేసే వాళ్ళకి లేదా అన్నట్టుగా ఉంటుంది .దీనికి సమాధానం మాత్రం శూన్యం,ఎన్నికల వల్ల లాభం ఎంతవరకు ఉంటుందో కాని వాటి కర్చు మాత్రం కోట్లల్లో ఉంటుంది మరి దీనికి జవాబుదారుడు ఎవ్వరు.ఇక్కడ కర్చు కోసం ఎన్నికలను విమర్శించటం కాదు కాని ,మధ్యంతర ఎన్నికల వల్లనే ఈ సమస్య ఎదురవుతుంది .ప్రబుత్వాలను కూల్చతమే ఒక ధ్యేయంగా పెట్టుకున్న కొన్ని రాజకియ్య పార్టిలను ఎమ్చేద్ధం అన్న ప్రశ్న తలేతుంది .ఈ మార్పు ఎక్కడకు దారితీస్తుందో మరి .ఎందరో రాజకియ్య నాయకుల్లో కొందరు కనీసం కొంతైనా సహాయం చేద్దాం అన్ట్టే దానికి అధికారుల సహకారం ఉండదు . దేశ ఆర్ధిక వ్యవస్థ ఎక్కడకు పోతుందో మనకే తెలియని స్థాయికి ఎదిగాం , కొందరి రాజకియ్య నాయకుల సంపాదన దేశ ఆర్ధిక వ్యవస్థనే మార్చివేస్తుంది అంటే ఆచర్య పడల్సినా అవసరం లేదుమరి అంతా "రాజ" "కియ్యం".ప్రకృతి సైతం కన్నెర్ర చేస్తుందు మరి జాగ్రత్త సుమీ (సునామీలు & లైలాలు) రావచ్చును .