Tuesday, November 3, 2020

      ఓటర్ చేతిలో దేశ భవిషత్తు (త్తా )? నోటులోనా ? కోటర్  మందులోనా  ?


ఎలక్షన్ కాలమంటేనే అందరికి సంతోషం, ఆనందం కదా ? నోట్ల కట్టలు ,సారాయి ప్యాకెట్లు ,బీరుబాటిళ్ళు మరియు బిర్యానీ పొట్లాలు వీటితో పాటు కులాల ప్యాకేజీలు వంటి బంపర్ ఆఫర్స్ . పోటీదారునికి గెలుపు బాధ , కార్యకర్తలకు పంపాకాల లొల్లి ,గల్లీలీడర్ల కు వాటాల గొడవ , ఇవి అన్ని కాకుండా డబ్బులు పంపించిన వాడికి లెక్కల బాధ . 

దేశ భవిషత్తు ఓటర్ చేతిలో ఉందని ప్రపంచాలు ,దేశాలు గట్టి నమ్మకాలు గా ఉన్నాయి , అయితే నాయకుని ఎన్నిక ఎలా ఉండాలని అంటే మాత్రం పెద్ద ప్రశ్న (?)లాగ ఉంటుంది . ప్రజా నాయకుని ఎన్నిక ఇలా జరిగిన నాడు దేశ భవిషత్ మారుతుందని నా గట్టి నమ్మకం , ఎక్కడ నోట్ల కట్టలు , బంగారం , సారాయి ,బిర్యాని పొట్లాలు ఉండవో అక్కడ నిజమైన నాయకుడు ఉన్నట్టు గా ఋజువు .  

ఓటర్ ఎన్నడు క్లారిటీ వస్తుందో కానీ , క్లారిటీ వచ్చేంత వరకు బ్రతుకు జట్కా బండి మరకలతో , ప్యాచులతో కాలం గడ్డుగా గడపాల్సిందే ? నాయకులూ ఓట్లప్పుడే మన ఊరి దాకా , పొలం దాకా , ఇంటిదాకా , మన దాకా వస్తారని ఎప్పుడుతెలుసుకుంటారో ... ? , ఎలక్షన్స్ తర్వాతా మల్లి కనబడితే పాపం ?, మన ఊరిదాకా రానేరాడు ,వచ్చిన మన చోట ,మోట నాయకులూ ఎక్కడివరకు పోనివ్వరు , ఒక వేళా పోనిచ్చిన నాయకుడి గార్డ్స్ రానివ్వరు . మరి మన నాయకులూ ఇది అంత గమనించి కూడా చూసి చూడకుండా ఉండే మన బడా నాయకుడు (?) , అంతర్లీనంగా తనలో తాను గర్వాంగా ఎన్నికల నాడు మమ్మలిని మీ ఇంటివద్దకు ,పొలం వద్దకు రప్పించుకొని బతిలాడించుకొని , నోట్లకు నోట్లు ,బిర్యాని పొట్లాలు ,సారాయి పొట్లాలు తీసుకున్నాకనే మందులో,మత్తులో మాకు ఓట్లేస్తారా ? అని కసితో మన వంక జాలిగా చూస్తూ ఉంటాడు (?). కాదా ?

ఏ నాయకుడు  ప్రజలకి ప్రతిరోజు అందుబాటులో ఉంటాడో తాను నిజమైన ప్రజా నాయకుడు . మన నాయకులకు కార్లు ,ఏసీ బంగ్లాలు మరియు మనం నాయకుడిని వద్దకు వెళ్లాలంటే  అడ్డుకునే గార్డులను మనమే సమ కూర్చిపెడితే మరి ప్రజలను దగ్గరికి రానివ్వద్దుకదా ?కాదు కూడదు అంటే నాయకుని రక్షణ ముఖ్యం కదా ? అని ఎదురు ప్రశ్న మిగులుతుంది మనకి . 

రక్షణ విషయంలో మాత్రం నాయకులకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని మాత్రం మన ఆర్ధిక గణాంకాల వల్ల స్పష్టత వస్తుంది , గౌరవ మాజీనాయకుడు కోటశ్రీనివాస్ రావ్ గారి మాటల్లో ఏంటంటే ,తాను ఒక టివి కి  ఇచ్చిన ముఖ మూకీ సారాంశం,  మన మాజీ MLA బాబుమోహన్ గారు మంచి గొప్ప నటన నైపుణ్యం కల్గిన నటులు,వీరిద్దరికి మంచి సాన్నిహిత్యం ఉంది కూడా , అయితే మాజీ నాయకుడు కోట శ్రీనివాస రావు గారు ,బాబుమోహన్ రావు గారు ఎదురు పడినప్పుడు నాకు ఉన్నారంటే , నాకు  , ఇద్దరు గన్మెన్స్ అని గర్వాంగా చూపుకుంటూ హేళనగా చూసుకున్నారటా? అంటే ప్రాణ కాపలా దారులు ( రక్షక దళం ) ఒక గర్వానికి , హోదాకి పదవికి చిమ్నంగా వారికి అలవాటుగా , గుర్తింపుగా మారింది , ఇది మన రాజకీయా నాయకుల పద్ధతులు  . 

మరి రక్షణ ఎవ్వరికి అవసరం ఉంటుంది ,నాయకులకేనా ? (నక్షలైట్స్  మరియు ఉగ్రవాదుల వంటి వారితో నిరంతరం పోరాడుతూ ప్రాణాలకు తెగించి )రక్షణ వ్యవస్థలో పనిచేసిన పొలిసు వారికి ,సీబీసీఐడీ ,ఇంటర్ పోల్ ,అతి సూక్ష్మ ,సున్నిత రక్షణ( పాకిస్థాన్ ,చైనా వంటి ) వ్యవస్థలో దేశ భవిషత్తు కోసం ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా ప్రాణాలు వదిలిన వారికి ,ఉద్యోగస్తులకు ఎటువంటి భద్రత కల్పించాం,వారి కుటుంబాలని ఎలా రక్షిస్తున్నాం , ఎలా సమాజంలో వారికి ఉన్న గుర్తింపు ఎలా ఉంది ? అని మనం సమాలోచన చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా ఆలోచన . లేదు గాంధీ వంటి శాంతికామకున్నికాపాడుకోలేక పోయాం ? మరి వీరి పరిస్థితి ఏంటానా ? దీనికి సమాధానం ఎక్కడికి నుండి రావాలి ? ఎప్పుడు రావాలి ?

అతి సాధారణ జన జీవనం ,ప్రజల మధ్య నిరంతరం ఉండే ప్రజా నాయకుని కోసం ఎప్పడికి ఎదురుచూపేనా ? ఎక్కడినుండి రావాలి ? ఎలా రావాలి ? ప్రజా నాయకుడు .?  

మావి గొప్ప దేశాలు అని చెప్పుకునే ఇతర దేశాలు అమెరికా వంటివి , వారి అధ్యక్ష ఎన్నికలకు పోటీచేసే నాయకులూ జీవిత కాలంలో, కేవలం ఒక సారి  మాత్రమే అధ్యక్ష పదవిని అనుభవించే చట్టం అక్కడ ఉంది ,అంటే తన జీవిత కాలంలో ఎప్పుడైనా  అధ్యక్ష పదవిని చేపట్టి, తన పదవి కాలం  ముగిసిన  తర్వాత ,తిరిగి అధ్యక్ష పదవికి తిరిగి పోటీ చెయ్యరాదు అని వారి నిబంధన. మరి మనకు వద్దా ఈ నిబంధన ?

ఒకప్పుడు ఇతర దేశాల ప్రజల ( ఇంజనేర్లు ,డాక్టర్లు ,మేధావులు )మీద ,ఇతర దేశాల సంపద మీద ఆధార పడి ,ఇవ్వాళా గొప్ప దేశం అని  ప్రపంచ దేశాలను గర్వంతో చూసే అమెరికా ,ఇంగ్లాండ్ వంటి దేశాలు వాటి రక్షణ వరకు వచ్చేసరికి , ఇతర దేశాలమీద ఆంక్షలు పెట్టె స్థాయికి ఎదిగింది మరి ? ఇన్ని రోజులు లేని వీసా వంటి వాటిపైన ఆంక్షలు ఇప్పుడే ఎందుకు ? ఆర్ధిక మాంద్యం వల్ల , వారి రక్షణ కోసం ,ఇతర దేశ ప్రజల పై , వారి ఆర్ధిక స్థితి పై భారం మోపుతూ ..... ?