Tuesday, December 7, 2021

                   ఆనారోగ్యం ఆసుపత్రులకా  ? పేద వాడికా ? 

వైద్యం ఒక వ్యాపారం ,చదువు ఒక వ్యాపారం ,న్యాయం  ఒక వ్యాపారం  ఇవన్నీ సమాజంలో సర్వ సాధారణంగా జరిగే విషయాలే కదా ? ఒక దేశ పౌరుడు అతి సంతోషంగా  ఒక  క్వాటర్ కు , ఒక బిర్యాని పోట్లానికి ,డబ్బులకు అమ్ముడుపోయ్యే రోజులు ఉన్నంత వరకు ఇవి సర్వ సాధారణంగా జరుగుతుంటాయి . 

ఆసుపత్రులలో లక్షలకు ,లక్షలు తీసుకొని వారి శవాన్ని అప్పగిస్తున్నారు కదా ? ఎక్కడికి వెళ్లాయి నియమ ,నిభందనలు ,చట్టాలు ... 

దేశం విలువ ,ప్రాణం విలువ తెలియని వారికి ఎన్ని చెప్పిన వ్యర్థమే కదా ? దేశానికి రాజు మంచి వాడైతే ప్రజలు సుఖ ,సంతోషాలతో సౌక్యంగా ,ఆనందంగా ఉంటారు , ఆలా కాకుండా  దేశానికి రాజు చెడ్డవాడైతే దేశప్రజలు మొత్తం కూడా అష్ట కష్టాల పాలై ,తినటానికి తిండి  , కట్టుకోవటానికి  బట్ట కరువై ,దేశం మొత్తం సర్వనాశనమై పోతుంది . పక్క దేశాలను చూస్తే తెలుస్తుంది కదా ?

100 కోట్ల జనాభా కలిగిన దేశం ,దాదాపుగా అతి ముఖ్యమైన  1000 నాయకుల కష్టాలను ,వారి కష్టాలుగా భావించి వివిధ పన్నుల రూపాలలో చెల్లిస్తుంటే ,వారికి మాత్రమే కష్టాలు ఉన్నట్టు ,విలాస వంతమైన సౌకర్యాలతో విమాన ప్రయాణాలకు , ఆసుపత్రులకు ,టెలిఫోన్ బిల్లులకు,రవాణా సౌకర్యాలను ఆనందంగా అనుభవిస్తూ ,ప్రజల ప్రతి రక్తం బొట్టుతో  సృష్టించ బడిన సౌకర్యాలతో జీవించే నాయకులకు  అందిస్తుంటే ,వారికి సాధారణ మనిషి  ఎలా కనిపిస్తారు , వారి అవసరాలు ఎలా కనిపిస్తాయి... 

ఏ ప్రభుత్వాలైన  , ప్రైవేట్ ఆసుపత్రులకు,ప్రభుత్వ ఆసుపత్రులకు  కావలిసిన అనుమతులను ఇవ్వ వలిసినది  ప్రభుత్వమే కాబట్టి ,వాటి వైఫల్యాలకు కారణం కూడా ప్రభుత్వం అని గమనించాలి కదా  ?   కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేసినప్పుడు , వాటి దోపిడీ వల్ల నష్టపోయిన ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించాలి కదా , ఆసుపత్రుల నిర్మాణం కోసం,వాటి నిర్వాణార్థం కావాల్సిన వనరులు కూడా ప్రజాధన0 నుండి సేకరించిందే కాబట్టి , ప్రతి పైసా కు జవాబిదారి తనం కావలి . 

దాదాపుగా 1000 మంది కోసం 100 కోట్ల ప్రజలు ఆహర్నిశలు కష్ట పడుతుంటే , ఆ 1000 మంది మాత్రం కోట్లకు ,కోట్లు వెనకేస్తు ,ఆస్తులను ,సంపదను కూడా బెడుతూ ,వారి పిల్లలకు ,ఆ తర్వాత ,వారి పిల్లలకు తర తరాలకు కావల్సిన ధనం సమకూర్చుకుంటూ పోతుంటారు . మరి అతి సాధారణ ప్రజల బహుషత్తు ఎలా ఉండాలి ,వారి పరిస్థితి ఎలా ?

సాధారణంగా  ఒక కుటుంబ పెద్ద  సంపాదిస్తే ,వారి పోషణ కుటుంబ పెద్ద పైనే ఉంటుంది కదా ? మరి ఇక్కడ కుటుంబ సభ్యులు పోషిస్తున్నారు కదా ? మరి దీనిని గమనించక పోతిమి కదా ?