Tuesday, June 1, 2021

     ఆనందయ్య మందును ఎందుకు అడ్డుకుంటున్నారు ? 

ప్రజల ప్రాణాలు గాలికొదిలేషి ,మేము మాత్రం గట్టిగా ,ఆస్తులను కూడపెట్టి తరతరాలకు సరిపోయే ఆస్తులను సంపాదించి పెడితే ఉండే ఆనందం అంత ఇంత కాదయా ? స్విస్ బ్యాంకులు ఎందుకున్నట్టు మరి ? ఇందుకేనాయే .... 

మెడికల్ మాఫియా మాములుగా లేదుగా ,ఎవ్వరిని ఎలా బెదిరించాలో అలా బెదిరిస్తున్నాయి మరి , ఎలా అంటే మీరు ఎప్పుడు ఎలెక్టన్స్ అంటే అప్పుడు ,ఎన్ని కోట్ల రూపాయలు మీకు ఉత్తి పుణ్యానికి ఇచ్చింది , మమ్మలిని , మా కంపెనీ లను కాపాడుతారని కదా . మీకిచ్చిన కానుకలు ఊరికే రావు కదా ? కాబట్టి మేము చెప్పినటువంటి విదంగా చెయ్యండి , ఆనందయ్య వంటి వారు పూర్తిగా ఉచితంగా ఇస్తే మాకేంటి లాభమయా ? మీకేంటి లాభమయా ? అందుకే వెంటనే ఆనందయ్య ను ముందు ప్రజలకు దూరం చేసి , ఏమి చేద్దామని ఆలోచిద్దాం , అంత వరకు ఆయనకు పూర్తి రక్షణ భాద్యత మొత్తం మీదే (అంటే తన మందును తనను కొన్నిరోజులు అజ్ఞాతంలో ఉంచండి అని ఆజ్ఞా )? ఆలోపు మీకు , మీ కుటుంబానికి ,శ్రేయోభిలాషులకు ,మిత్రులకు మొత్తం మీ బలగానికి కావాల్సినంత మందును తయారు చేపించుకొని ,మీరు వాడి ,మీ అనుకునే వారికి అందించి . ఆ తర్వాత ప్రజలకు బ్రతికుంటే అప్పుడు మందును అందిద్దాం ? పోయిన వారు మిగిలాగా , ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న వారు పోయిన వారు కాగా ,ఉన్నవారిని ఆర్థికంగా పీల్చి ,పిప్పి చేసి అప్పుడు ఆనందయ్య మందు గురించి ఆలోచన చేద్దాం ,అప్పటి వరకు నిశ్శబ్దం ?? 

కరోనా పుణ్యాన ఆసుపత్రుల ఆదాయం  కొన్ని లక్షల కోట్ల వ్యాపారం నిరాటకంగా ధనార్జన కొనసాగింది ,కొనసాగుతుంది కూడా ? దానికి నాయకుల అండదండలు పుష్కలం కదా ? 

ఆనందయ్య మందు అనగానే చట్టాలు గురుతుకొస్తాయి మరి ,మంచి జరుగుతుందిరా బాబు అంటే వినరు కదా ? అప్పుడే అధికారులు కూడా వత్తాసు పలకటం ,దానికి ప్రభుత్వ పరిశీలన అంటూ కాలయాపన చెయ్యటం , ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం పరిపాటైపోయింది ,కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా ఆనందయ్య ను దాచటం ఎంత వరకు సమంజసం అంటారు ? ప్రభుత్వ పరిశీలన మెడికల్ షాపుల పైన , ప్రైవేట్ ఆసుపత్రిల పైన , ఎటువంటి అర్హత లేకుండా డాక్టర్ సెర్టిఫికెట్ తెచ్చుకొని ప్రజల ప్రాణాల మీదికి తెచ్చేవారిపై ఇంత నిఘా ఉండదు, కాలం చెల్లిన మందులను అమ్మిన వారిపై ఎటువంటి చర్యలు ఉండవు కదా ? ఇటువంటి వాటిపైన నాయకులూ స్పందించాల్సి వస్తే డ్రగ్ ఇన్సపెక్టర్స్,మరియు దానికి సంబందించిన ఉద్యోగార్థులు లేనందున  ,ఆ పరివేక్షణ సరిగా లేదు  అని సెలవివట్టం జరుగుతుంది అయ్యా?

 కానీ మీకు అవసరం అయ్యే ఉద్యోఆర్తులను మాత్రం వెంటనే భర్తీ చేసుకొని మీ ముందు నిలబెట్టుకుంటారు, వారిలో మీకు బాగా అవసరం ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేస్తారు ,వారిలో కొన్ని  పోలీస్ ,ప్రత్యేక సెక్యూరిటీ ,బుల్లెట్ప్రూఫ్ వాహనాలను మాత్రం వెంటనే టెండర్లను పిలవటం భర్తీ చేసుకోవటం పరిపాటై పోయింది కదా ?

సమాజంలోకి లంచం ,కల్తీ అనే రెండు చీడపురుగులను , మరియు ఒక్క మందు సీసాకు ,నోటుకు అమ్ముడు పోయే ప్రజలు ఉన్నన్ని నాళ్ళు ,మీ యొక్క పైశాచిక  ఆనందాన్ని పొందే మీలాంటి వారు ఉన్నంత వరకు సామాన్య, మధ్యతరగతి  ప్రజల రక్షణ ఎప్పుడు ప్రశ్నఅర్థకమే కాదా ?  

 తన స్వార్థం కోసం ,కేవలం తన ( వారి కోసం) స్వార్థం కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని  బ్రష్టు పట్టించే నాయకులూ ఉన్నన్ని రోజులు భారతావని దుక్క సంద్రంలో మునిగి ఉంటుంది అని అక్షర సత్యం కదా? మీ కక్ష పూరిత రాజకీయా ల వల్ల , ఇటు అధికారులు ,అటు రాష్ట్ర ప్రజలు నరకయాతన చెందుతున్నారు ,కారణం మీ యొక్క వ్యక్తి గత కక్ష వల్ల పోలీసులు ,నాయకులూ ,ప్రజలు ఏమి జరుగుతుందో అని క్షణక్షణం భయంతో ,భాదతో తల్లడిల్లుతున్నారు , దానికి మీరే కారణం కదా జగన్ గారు ,కేవలం మీ యొక్క ప్రత్యేక శ్రద్ధ వల్ల పోలీసులు ,మిగతా అధికారులు ఉన్న పని చాలదని ,మీరు కొత్తగా కలగా చేసే భయానక సంఘటనలను చూస్తూ కాలాన్ని ,ప్రభుత్వ దాణాన్ని వృధా చెయ్యటం లేదా ? ఇది మీకు కనిపించటం లేదా ? అవునులే మీకా శ్రమ ఉండదు లే మీరు రాజకీయంలోకి రావటమే కక్ష సాధింపులకు కాబట్టి ,ప్రజలెటు పోతే ,మీకేంటి లే పిచ్చి ప్రజలు ? భీష్ముడి వంటి ఆపార అనుభవం ఉన్న రాజకీయా వృద్ధుడు ఉండగా , మీకు ఒక్క అవకాశం అని అనగానే గొర్రె కసాయివాన్ని నమ్మినట్టు మిమల్ని నమ్మి ఓట్లేస్తే మీరు ప్రజా పరిపాలన చెయ్యకుండా ? ప్రజా ద్రోహిగా మారి రాక్షస పాలనను కొనసాగిస్తున్నావు కదా ? మరి ఆంధ్ర ప్రజానీకానికి  ఇలా జరిగి తీరాల్సిందే కదా  ? నాయకా ?

కనీసం ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది ఒక జాతియ విప్పత్తు అని దీనికి అభం శుభం తెలియని వారు ,కేవలం మీ నిర్లక్ష్యం వల్లనే కొన్ని లక్షల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది .... మరి వెంటనే ఆనందయ్య మందును తక్కువ సమయంలో ,అందరికి ఎంత త్వరగా చేరిస్తే అంత మంది కరోనా నుండి త్వరగా బయట పడతారని తెలుసుకొని మసులుకుంటావని కాంక్ష .....