Saturday, September 18, 2021

                                   జగన్ (అవి)నీతి మైయం ( ?  )

ఒక కుటుంబ పెద్ద యొక్క ఆలోచన సరళి సరైన పద్దతిలో లేకుండా పోతే ,ఆ కుటుంబం మొత్తం   ఎంత సమస్యలు పడతారో , ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సరైనోడు లేకుండా పోతే ,ఆ రాష్ట్రం ఎంతటి దౌర్భాగ్యాన్ని చవిచూస్తుందో దానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టంగా కనబడుతుంది ? కదా ?

ముందునుండి అవినీతి చరిత్ర కలిగిన ఒక మాజీ  ముఖ్యమంత్రి కుమారుడు ,ఇప్పుడు ఏకంగా ఒక ముఖ్య    మంత్రి స్థానంలో ఉండి  ,ప్రజలకు న్యాయం చేస్తాడని నమ్మిన వారిని నట్టేట ముంచటానికే సీఎం అవతార మెత్తిన మహానుబాహుడు ? ఏ ప్రభుత్వానికైనా ప్రజలు  చెల్లించే పన్నుల   నుండి వచ్చిన రూపాయలే  ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తాయని ప్రజలు ఎందుకు గమనించటం లేదు ,గమనించే స్థాయిని మైమరిపించే జిమ్మిక్కులు ,మాయ మాటలు చెప్పుకుంటూ వారి కాలాన్ని ,అతి సుకంగా ,సౌక్యంగా ,విలాసవంతంగా 5 సం,,ల కాలాన్ని వృధా గా గడిపి ఎన్నికలముందు నెరవేర్చ లేని  హామీలను ఇస్తూ ,మళ్ళీ 5 సం ,, కాలాన్ని వృధా చెయ్యటానికి విశ్వా ప్రయత్నం చేస్తున్నారని ఎందుకు గమనించ లేకపోతున్నాం ? ఎవ్వారి డబ్బులు ,ఎవ్వరు ,ఎవ్వరికి దానమిస్తున్నారు ? ఎందుకు దానం మనకు ? 

వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం ఎందుకు ,ఎప్పుడు జరిగింది ? వైస్ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉండేది ? కుమారుడి పరిపాలన ఎలా ఉంది ? ఎందుకు ఇంత తేడా మరి ? ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకునే నాయకుడు ఎక్కడా ? రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటానికి గల  కారణాలకంటే ,మీ వద్ద ఉన్న వేయిల కోట్ల రూపాయలను ప్రజల కోసం దానం ఇవ్వవచ్చుకదా ?ఎందుకు ఇవ్వటంలేదు? దోచుకొని ,దాచుకోవటమే తెలుసు కానీ ,తిరిగి ఇచ్చేది లే ? అని గట్టిగా ఉన్నారు ? నిర్మాణం జరిగిపోయిన కట్టడాలను కూల్చటానికి వెళ్ళినప్పుడు తెలియదా ? అవి కూడా ప్రజల రొక్కంతోనే నిర్మించపడ్డాయని ?రాష్ట్ర రాజధాని నిర్మాణంలో అసువులు బాసిన రైతులెందరు  సారూ ?అన్యాయంగా లాక్కున్న భూములెంత ? దాని విలువ ఎంత ? తెలుసా మీకు ? రెక్కల కష్టాన్ని నమ్మిన రైతు యొక్క గొంతును తడిగుడ్డతో గొంతు కొయ్యటం అంటే ఇదే కదా ?ఒక్క ఛాన్స్,ఒక్క ఛాన్స్  ఇవ్వండి అంటూ, ఈ రోజు రోజాతో కలిసి వారి రక్తాన్ని తాగుతున్నారు   కదా ? ఇన్సైడర్ అంటూ కొత్త కథను చెప్పి ,ఆ కాలయాపనతో మిగతా టౌన్ లల్లో వందల ఎకరాలు జమచేసి ,ముచ్చటగా మూడు రాజధానుల కథ చెప్పుకొస్తున్నావ్ ఏంటి కథా సామి ?తండ్రి కాలంలోనే మింగిన కోట్ల రూపాయల  ముచ్చట ఎటూపాయే  సామి ? ఒక సారి అనుభవంచిన  జైలు జీవితం కావాలా నాయనా ?  

రాజకీయ నాయకులు "నాయకులు" అవ్వటానికి అర్హతలు :

రాజకీయంలో మాత్రమే వారసత్వ  రాజకీయాలు  ఉండాలా ? ప్రభుత్వ ఉద్యోగాలల్లో మాత్రం వద్దు కదా ? ఎందుకు ? అలా ?ఉద్యోగం ఇవ్వాలంటే పలానా సెర్టిఫికెట్ ఉండాలి , దానికి తగిన నైపుణ్యం ఉండాలి ,దానికి తగిన వయస్సు ఉండాలి , అర్హతల పట్టీని  మీకెందుకు ఉండకూడదు ? ఉండాలి కనీసం 5 సం ,, రాల మిలటరీ సోల్జరై ఉండాలి ,వ్యవసాయ దారుడై ఉండాలి ,భారత దేశంలో మాత్రమే చదువుకొని ఉండాలి ,కనీసం మాతృభాష తెలుగై ఉండి , మాతృ భాష లో వ్రాయటం కూడా స్పష్టంగా రావాలి, మరియు ముక్యంగా భారతీయ్యుడై ఉండాలి ,అంతే ముక్యంగా తన పైన ఎటువంటి కేసులు వుండకూడదు (పెండింగ్ కేసులు కానీ ,కోర్టులో ఉన్న కేసులు మొదలుకొని ). 

మల్లి వచ్చే ఎన్నికలల్లో పై వన్నీ తీసుకొని రండి ,తిరిగి వచ్చే ఎన్నికలల్లో సుమీ ......