Tuesday, December 7, 2021

                   ఆనారోగ్యం ఆసుపత్రులకా  ? పేద వాడికా ? 

వైద్యం ఒక వ్యాపారం ,చదువు ఒక వ్యాపారం ,న్యాయం  ఒక వ్యాపారం  ఇవన్నీ సమాజంలో సర్వ సాధారణంగా జరిగే విషయాలే కదా ? ఒక దేశ పౌరుడు అతి సంతోషంగా  ఒక  క్వాటర్ కు , ఒక బిర్యాని పోట్లానికి ,డబ్బులకు అమ్ముడుపోయ్యే రోజులు ఉన్నంత వరకు ఇవి సర్వ సాధారణంగా జరుగుతుంటాయి . 

ఆసుపత్రులలో లక్షలకు ,లక్షలు తీసుకొని వారి శవాన్ని అప్పగిస్తున్నారు కదా ? ఎక్కడికి వెళ్లాయి నియమ ,నిభందనలు ,చట్టాలు ... 

దేశం విలువ ,ప్రాణం విలువ తెలియని వారికి ఎన్ని చెప్పిన వ్యర్థమే కదా ? దేశానికి రాజు మంచి వాడైతే ప్రజలు సుఖ ,సంతోషాలతో సౌక్యంగా ,ఆనందంగా ఉంటారు , ఆలా కాకుండా  దేశానికి రాజు చెడ్డవాడైతే దేశప్రజలు మొత్తం కూడా అష్ట కష్టాల పాలై ,తినటానికి తిండి  , కట్టుకోవటానికి  బట్ట కరువై ,దేశం మొత్తం సర్వనాశనమై పోతుంది . పక్క దేశాలను చూస్తే తెలుస్తుంది కదా ?

100 కోట్ల జనాభా కలిగిన దేశం ,దాదాపుగా అతి ముఖ్యమైన  1000 నాయకుల కష్టాలను ,వారి కష్టాలుగా భావించి వివిధ పన్నుల రూపాలలో చెల్లిస్తుంటే ,వారికి మాత్రమే కష్టాలు ఉన్నట్టు ,విలాస వంతమైన సౌకర్యాలతో విమాన ప్రయాణాలకు , ఆసుపత్రులకు ,టెలిఫోన్ బిల్లులకు,రవాణా సౌకర్యాలను ఆనందంగా అనుభవిస్తూ ,ప్రజల ప్రతి రక్తం బొట్టుతో  సృష్టించ బడిన సౌకర్యాలతో జీవించే నాయకులకు  అందిస్తుంటే ,వారికి సాధారణ మనిషి  ఎలా కనిపిస్తారు , వారి అవసరాలు ఎలా కనిపిస్తాయి... 

ఏ ప్రభుత్వాలైన  , ప్రైవేట్ ఆసుపత్రులకు,ప్రభుత్వ ఆసుపత్రులకు  కావలిసిన అనుమతులను ఇవ్వ వలిసినది  ప్రభుత్వమే కాబట్టి ,వాటి వైఫల్యాలకు కారణం కూడా ప్రభుత్వం అని గమనించాలి కదా  ?   కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేసినప్పుడు , వాటి దోపిడీ వల్ల నష్టపోయిన ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించాలి కదా , ఆసుపత్రుల నిర్మాణం కోసం,వాటి నిర్వాణార్థం కావాల్సిన వనరులు కూడా ప్రజాధన0 నుండి సేకరించిందే కాబట్టి , ప్రతి పైసా కు జవాబిదారి తనం కావలి . 

దాదాపుగా 1000 మంది కోసం 100 కోట్ల ప్రజలు ఆహర్నిశలు కష్ట పడుతుంటే , ఆ 1000 మంది మాత్రం కోట్లకు ,కోట్లు వెనకేస్తు ,ఆస్తులను ,సంపదను కూడా బెడుతూ ,వారి పిల్లలకు ,ఆ తర్వాత ,వారి పిల్లలకు తర తరాలకు కావల్సిన ధనం సమకూర్చుకుంటూ పోతుంటారు . మరి అతి సాధారణ ప్రజల బహుషత్తు ఎలా ఉండాలి ,వారి పరిస్థితి ఎలా ?

సాధారణంగా  ఒక కుటుంబ పెద్ద  సంపాదిస్తే ,వారి పోషణ కుటుంబ పెద్ద పైనే ఉంటుంది కదా ? మరి ఇక్కడ కుటుంబ సభ్యులు పోషిస్తున్నారు కదా ? మరి దీనిని గమనించక పోతిమి కదా ?

Thursday, October 14, 2021

                                                      సినిమా వారి సిత్రాలు 

మా (MAA ) అర్థాన్నే పూర్తిగా మార్చేసారు కదా ? MAA (MOVIE ARTS ASSOSIATION ) ను మాకు అనుకూలంగా మా ఇష్టానుసారం  గా మార్చుకుంటాం మీకేంటి  ? అంటూ  వెర్రిమొఖాలు వేసరేంటో మరి ? నిన్నటి వరకు ఇష్టం వచ్చినట్టుగా బండ బూతులు తిట్టుకొని మళ్ళి తెల్ల మొఖాలతో ఫ్రెషగా ఉదయాన్నే దర్శనం ఇచ్చారు ,కారణం అందులో ఉన్నవి కోట్లల్లో లావా దేవీలు కాబట్టి ,మా (MAA ) పై అందరి ద్రుష్టి కమర్షయిల్గా  మారింది . 

కోట్ల రూపాయల లావా దేవీలు ఎక్కడైతే  ఉంటాయో గద్దలాగా మేము అక్కడ రెడీగా ఉంటాం అంటూ ,అరువుకు (ఔటర్ సైడ్ )వచ్చిన వారు సిద్ధంగా ఉంటారు కదా ? దాంట్లో ముక్యంగా ప్రకాష్ రాజ్ అనే నీతిమాలిన వాడు ముందుంటాడు కదా ? ప్రకాష్ రాజ్  కు జీవితాన్ని ఇచ్చిన మన  కళామా తల్లి  అయినా తెలుగు తల్లిని కించపరిచే ఒక  మూర్ఖుడికి కావలిసిన విదంగానే  జరగటం ఒక శుభ సూచకమనే చెప్పాలి . 

మన వద్ద కొన్ని వేయిల కోట్లను పారిదోషకంగా తీసుకొని ,మన డబ్బులతో జీవితంలో ఎదిగి ,మన సంసుకృతిని వెక్కిరించే తనకు ,భారతీయ జీవన విధానం ను తప్పు పట్టే ఒక నియంత లక్షణాలను కలిగిన ఒక  మూర్కుడిని(మోనార్కును )  నిషేదించటం మాత్రమే సరైన పద్దతని మన తెలుగు వారికి  తెలియదా ? ఏమిటి ? పోనిలే అని దయతలిస్తే అది మన చేతకాని తనంగా భావించే మోనార్కును క్షమించే ప్రసక్తే లేదని ... కరా కండిగా  చెప్పటం జరిగింది .

ఇది చాలదా ? ఆ మూర్ఖుడికి ...... ???? 

Saturday, September 18, 2021

                                   జగన్ (అవి)నీతి మైయం ( ?  )

ఒక కుటుంబ పెద్ద యొక్క ఆలోచన సరళి సరైన పద్దతిలో లేకుండా పోతే ,ఆ కుటుంబం మొత్తం   ఎంత సమస్యలు పడతారో , ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సరైనోడు లేకుండా పోతే ,ఆ రాష్ట్రం ఎంతటి దౌర్భాగ్యాన్ని చవిచూస్తుందో దానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టంగా కనబడుతుంది ? కదా ?

ముందునుండి అవినీతి చరిత్ర కలిగిన ఒక మాజీ  ముఖ్యమంత్రి కుమారుడు ,ఇప్పుడు ఏకంగా ఒక ముఖ్య    మంత్రి స్థానంలో ఉండి  ,ప్రజలకు న్యాయం చేస్తాడని నమ్మిన వారిని నట్టేట ముంచటానికే సీఎం అవతార మెత్తిన మహానుబాహుడు ? ఏ ప్రభుత్వానికైనా ప్రజలు  చెల్లించే పన్నుల   నుండి వచ్చిన రూపాయలే  ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తాయని ప్రజలు ఎందుకు గమనించటం లేదు ,గమనించే స్థాయిని మైమరిపించే జిమ్మిక్కులు ,మాయ మాటలు చెప్పుకుంటూ వారి కాలాన్ని ,అతి సుకంగా ,సౌక్యంగా ,విలాసవంతంగా 5 సం,,ల కాలాన్ని వృధా గా గడిపి ఎన్నికలముందు నెరవేర్చ లేని  హామీలను ఇస్తూ ,మళ్ళీ 5 సం ,, కాలాన్ని వృధా చెయ్యటానికి విశ్వా ప్రయత్నం చేస్తున్నారని ఎందుకు గమనించ లేకపోతున్నాం ? ఎవ్వారి డబ్బులు ,ఎవ్వరు ,ఎవ్వరికి దానమిస్తున్నారు ? ఎందుకు దానం మనకు ? 

వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం ఎందుకు ,ఎప్పుడు జరిగింది ? వైస్ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉండేది ? కుమారుడి పరిపాలన ఎలా ఉంది ? ఎందుకు ఇంత తేడా మరి ? ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకునే నాయకుడు ఎక్కడా ? రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటానికి గల  కారణాలకంటే ,మీ వద్ద ఉన్న వేయిల కోట్ల రూపాయలను ప్రజల కోసం దానం ఇవ్వవచ్చుకదా ?ఎందుకు ఇవ్వటంలేదు? దోచుకొని ,దాచుకోవటమే తెలుసు కానీ ,తిరిగి ఇచ్చేది లే ? అని గట్టిగా ఉన్నారు ? నిర్మాణం జరిగిపోయిన కట్టడాలను కూల్చటానికి వెళ్ళినప్పుడు తెలియదా ? అవి కూడా ప్రజల రొక్కంతోనే నిర్మించపడ్డాయని ?రాష్ట్ర రాజధాని నిర్మాణంలో అసువులు బాసిన రైతులెందరు  సారూ ?అన్యాయంగా లాక్కున్న భూములెంత ? దాని విలువ ఎంత ? తెలుసా మీకు ? రెక్కల కష్టాన్ని నమ్మిన రైతు యొక్క గొంతును తడిగుడ్డతో గొంతు కొయ్యటం అంటే ఇదే కదా ?ఒక్క ఛాన్స్,ఒక్క ఛాన్స్  ఇవ్వండి అంటూ, ఈ రోజు రోజాతో కలిసి వారి రక్తాన్ని తాగుతున్నారు   కదా ? ఇన్సైడర్ అంటూ కొత్త కథను చెప్పి ,ఆ కాలయాపనతో మిగతా టౌన్ లల్లో వందల ఎకరాలు జమచేసి ,ముచ్చటగా మూడు రాజధానుల కథ చెప్పుకొస్తున్నావ్ ఏంటి కథా సామి ?తండ్రి కాలంలోనే మింగిన కోట్ల రూపాయల  ముచ్చట ఎటూపాయే  సామి ? ఒక సారి అనుభవంచిన  జైలు జీవితం కావాలా నాయనా ?  

రాజకీయ నాయకులు "నాయకులు" అవ్వటానికి అర్హతలు :

రాజకీయంలో మాత్రమే వారసత్వ  రాజకీయాలు  ఉండాలా ? ప్రభుత్వ ఉద్యోగాలల్లో మాత్రం వద్దు కదా ? ఎందుకు ? అలా ?ఉద్యోగం ఇవ్వాలంటే పలానా సెర్టిఫికెట్ ఉండాలి , దానికి తగిన నైపుణ్యం ఉండాలి ,దానికి తగిన వయస్సు ఉండాలి , అర్హతల పట్టీని  మీకెందుకు ఉండకూడదు ? ఉండాలి కనీసం 5 సం ,, రాల మిలటరీ సోల్జరై ఉండాలి ,వ్యవసాయ దారుడై ఉండాలి ,భారత దేశంలో మాత్రమే చదువుకొని ఉండాలి ,కనీసం మాతృభాష తెలుగై ఉండి , మాతృ భాష లో వ్రాయటం కూడా స్పష్టంగా రావాలి, మరియు ముక్యంగా భారతీయ్యుడై ఉండాలి ,అంతే ముక్యంగా తన పైన ఎటువంటి కేసులు వుండకూడదు (పెండింగ్ కేసులు కానీ ,కోర్టులో ఉన్న కేసులు మొదలుకొని ). 

మల్లి వచ్చే ఎన్నికలల్లో పై వన్నీ తీసుకొని రండి ,తిరిగి వచ్చే ఎన్నికలల్లో సుమీ ...... 

 

Tuesday, June 1, 2021

     ఆనందయ్య మందును ఎందుకు అడ్డుకుంటున్నారు ? 

ప్రజల ప్రాణాలు గాలికొదిలేషి ,మేము మాత్రం గట్టిగా ,ఆస్తులను కూడపెట్టి తరతరాలకు సరిపోయే ఆస్తులను సంపాదించి పెడితే ఉండే ఆనందం అంత ఇంత కాదయా ? స్విస్ బ్యాంకులు ఎందుకున్నట్టు మరి ? ఇందుకేనాయే .... 

మెడికల్ మాఫియా మాములుగా లేదుగా ,ఎవ్వరిని ఎలా బెదిరించాలో అలా బెదిరిస్తున్నాయి మరి , ఎలా అంటే మీరు ఎప్పుడు ఎలెక్టన్స్ అంటే అప్పుడు ,ఎన్ని కోట్ల రూపాయలు మీకు ఉత్తి పుణ్యానికి ఇచ్చింది , మమ్మలిని , మా కంపెనీ లను కాపాడుతారని కదా . మీకిచ్చిన కానుకలు ఊరికే రావు కదా ? కాబట్టి మేము చెప్పినటువంటి విదంగా చెయ్యండి , ఆనందయ్య వంటి వారు పూర్తిగా ఉచితంగా ఇస్తే మాకేంటి లాభమయా ? మీకేంటి లాభమయా ? అందుకే వెంటనే ఆనందయ్య ను ముందు ప్రజలకు దూరం చేసి , ఏమి చేద్దామని ఆలోచిద్దాం , అంత వరకు ఆయనకు పూర్తి రక్షణ భాద్యత మొత్తం మీదే (అంటే తన మందును తనను కొన్నిరోజులు అజ్ఞాతంలో ఉంచండి అని ఆజ్ఞా )? ఆలోపు మీకు , మీ కుటుంబానికి ,శ్రేయోభిలాషులకు ,మిత్రులకు మొత్తం మీ బలగానికి కావాల్సినంత మందును తయారు చేపించుకొని ,మీరు వాడి ,మీ అనుకునే వారికి అందించి . ఆ తర్వాత ప్రజలకు బ్రతికుంటే అప్పుడు మందును అందిద్దాం ? పోయిన వారు మిగిలాగా , ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న వారు పోయిన వారు కాగా ,ఉన్నవారిని ఆర్థికంగా పీల్చి ,పిప్పి చేసి అప్పుడు ఆనందయ్య మందు గురించి ఆలోచన చేద్దాం ,అప్పటి వరకు నిశ్శబ్దం ?? 

కరోనా పుణ్యాన ఆసుపత్రుల ఆదాయం  కొన్ని లక్షల కోట్ల వ్యాపారం నిరాటకంగా ధనార్జన కొనసాగింది ,కొనసాగుతుంది కూడా ? దానికి నాయకుల అండదండలు పుష్కలం కదా ? 

ఆనందయ్య మందు అనగానే చట్టాలు గురుతుకొస్తాయి మరి ,మంచి జరుగుతుందిరా బాబు అంటే వినరు కదా ? అప్పుడే అధికారులు కూడా వత్తాసు పలకటం ,దానికి ప్రభుత్వ పరిశీలన అంటూ కాలయాపన చెయ్యటం , ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం పరిపాటైపోయింది ,కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా ఆనందయ్య ను దాచటం ఎంత వరకు సమంజసం అంటారు ? ప్రభుత్వ పరిశీలన మెడికల్ షాపుల పైన , ప్రైవేట్ ఆసుపత్రిల పైన , ఎటువంటి అర్హత లేకుండా డాక్టర్ సెర్టిఫికెట్ తెచ్చుకొని ప్రజల ప్రాణాల మీదికి తెచ్చేవారిపై ఇంత నిఘా ఉండదు, కాలం చెల్లిన మందులను అమ్మిన వారిపై ఎటువంటి చర్యలు ఉండవు కదా ? ఇటువంటి వాటిపైన నాయకులూ స్పందించాల్సి వస్తే డ్రగ్ ఇన్సపెక్టర్స్,మరియు దానికి సంబందించిన ఉద్యోగార్థులు లేనందున  ,ఆ పరివేక్షణ సరిగా లేదు  అని సెలవివట్టం జరుగుతుంది అయ్యా?

 కానీ మీకు అవసరం అయ్యే ఉద్యోఆర్తులను మాత్రం వెంటనే భర్తీ చేసుకొని మీ ముందు నిలబెట్టుకుంటారు, వారిలో మీకు బాగా అవసరం ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేస్తారు ,వారిలో కొన్ని  పోలీస్ ,ప్రత్యేక సెక్యూరిటీ ,బుల్లెట్ప్రూఫ్ వాహనాలను మాత్రం వెంటనే టెండర్లను పిలవటం భర్తీ చేసుకోవటం పరిపాటై పోయింది కదా ?

సమాజంలోకి లంచం ,కల్తీ అనే రెండు చీడపురుగులను , మరియు ఒక్క మందు సీసాకు ,నోటుకు అమ్ముడు పోయే ప్రజలు ఉన్నన్ని నాళ్ళు ,మీ యొక్క పైశాచిక  ఆనందాన్ని పొందే మీలాంటి వారు ఉన్నంత వరకు సామాన్య, మధ్యతరగతి  ప్రజల రక్షణ ఎప్పుడు ప్రశ్నఅర్థకమే కాదా ?  

 తన స్వార్థం కోసం ,కేవలం తన ( వారి కోసం) స్వార్థం కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని  బ్రష్టు పట్టించే నాయకులూ ఉన్నన్ని రోజులు భారతావని దుక్క సంద్రంలో మునిగి ఉంటుంది అని అక్షర సత్యం కదా? మీ కక్ష పూరిత రాజకీయా ల వల్ల , ఇటు అధికారులు ,అటు రాష్ట్ర ప్రజలు నరకయాతన చెందుతున్నారు ,కారణం మీ యొక్క వ్యక్తి గత కక్ష వల్ల పోలీసులు ,నాయకులూ ,ప్రజలు ఏమి జరుగుతుందో అని క్షణక్షణం భయంతో ,భాదతో తల్లడిల్లుతున్నారు , దానికి మీరే కారణం కదా జగన్ గారు ,కేవలం మీ యొక్క ప్రత్యేక శ్రద్ధ వల్ల పోలీసులు ,మిగతా అధికారులు ఉన్న పని చాలదని ,మీరు కొత్తగా కలగా చేసే భయానక సంఘటనలను చూస్తూ కాలాన్ని ,ప్రభుత్వ దాణాన్ని వృధా చెయ్యటం లేదా ? ఇది మీకు కనిపించటం లేదా ? అవునులే మీకా శ్రమ ఉండదు లే మీరు రాజకీయంలోకి రావటమే కక్ష సాధింపులకు కాబట్టి ,ప్రజలెటు పోతే ,మీకేంటి లే పిచ్చి ప్రజలు ? భీష్ముడి వంటి ఆపార అనుభవం ఉన్న రాజకీయా వృద్ధుడు ఉండగా , మీకు ఒక్క అవకాశం అని అనగానే గొర్రె కసాయివాన్ని నమ్మినట్టు మిమల్ని నమ్మి ఓట్లేస్తే మీరు ప్రజా పరిపాలన చెయ్యకుండా ? ప్రజా ద్రోహిగా మారి రాక్షస పాలనను కొనసాగిస్తున్నావు కదా ? మరి ఆంధ్ర ప్రజానీకానికి  ఇలా జరిగి తీరాల్సిందే కదా  ? నాయకా ?

కనీసం ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది ఒక జాతియ విప్పత్తు అని దీనికి అభం శుభం తెలియని వారు ,కేవలం మీ నిర్లక్ష్యం వల్లనే కొన్ని లక్షల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది .... మరి వెంటనే ఆనందయ్య మందును తక్కువ సమయంలో ,అందరికి ఎంత త్వరగా చేరిస్తే అంత మంది కరోనా నుండి త్వరగా బయట పడతారని తెలుసుకొని మసులుకుంటావని కాంక్ష ..... 

Thursday, May 20, 2021

                                               జగన్ కు  జైలు అనుభవం ఉంది కదా  ?

రాజకీయా చదరంగంలో అందరు ఎదో ఒక రోజు  పావులు కావల్సిందే , దాంట్లో ఎవ్వరు ఎంత నష్టపోయారనడానికి   కాలమే జవాబు చెబుతుంది ?. పూర్వ కాలంలో రాజులు ,రాజ్యాలు ,మణులు ,మాణిక్యాలు ,వజ్ర వైరూఢ్యాలు కాల గర్భంలో కలిసి పోయాయి  దీనికి ప్రత్యేక్ష నిదర్శనం గతం తాలూకా రాజభవనాలు , మొండి (సగం పడిపోయిన గోడలు )గోడలు మిగిలాయని చరిత్ర నేర్పిన పాఠం, మనకు ఇది పుస్తక జ్ఞానం అని అనుకున్న సరే ఆధారాలతో తెలియ చేస్తున్న మన చరిత్ర పాఠాలు . 

నిన్నటి వైభవం ,రేపటి ఒట్టి మట్టిదిబ్బ అని తెలిపిన కాలాన్ని ఇంకా మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం ? కాదు ,కాదు జనం మనం  అర్థం చేసుకోవట్లేదు కానీ నాయకులూ బాగా అర్థం చేసుకున్నారు కాబట్టే , దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కపెట్టుకోవాలని అందినంత వరకు దోచుకోవడం మొదలెట్టారు మరీ ను ....... ఇది నీతి ...... న్యాయం కూడా !

జాతి అహంకారంతో ,ప్రాంతాలు ,భాష వంటి కారణాలతో మారణ కాండలు జరిపించినటువంటి ఈ లీడర్లను ఇంకా నమ్మి మోసపోవటం మన జన్మ హక్కు అంటూ వారివెంట ,వారి కుటుంబ సభ్యుల వెంట కుక్కల వలె  విశ్వాసంగా ఉంటున్నాం కదా ? ఇక్కడ ఇంకోటి గమనించాలి మనందరం    కుక్కలమంటూ బహిరంగంగా నే విమర్శించినటువంటి నాయకుల వెంట ఉన్నన్ని రోజులు మనకు మంచి రోజులు లేవని గమనించాలి ..... 

నేనే ముఖ్యమంత్రినని విర్రవీగి కక్ష పూరితంగా అందరిని జైల్లో తోసెయ్యటం సరైన పద్ధతేనా నాయకా? రాష్ట్రము మొత్తం భయబ్రాంతులకు గురై పనులను చేసుకొనిపోతున్నారు కాదయ్యా ?అవును లే, గత జైలు జీవితం గుర్తొచ్చిందా ఏమిటి , అది ప్రజా సొమ్ము లక్షల కోట్ల రూపాయలు కాజేసినందుకు జైలుకెళ్లారు మరి ,వీరేమి చేసారు నాయకా ? నీయమ్మ మొగుడా అని అరిచే అనిల్ గారికి ఎంత మంది అమ్మమొగుళ్ళున్నారో మరి ? ఇటువంటి దరిద్రం గొట్టు మాటలు వినాల్సివస్తున్నందుకు ,మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్నాం అని సిగ్గుకే సిగ్గుపడేలా చెయ్యకండి ..... 

భీష్ముడి వంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిండు సభలో అతి గోరంగా అవమానించటం ఎంతవరకు సమంజసం, ఈ అధికారంలో ఉన్న నాయకులకు ? చంద్రబాబు నాయుడు వంటి అనుభవం ఉన్న నాయకుడి ఆలోచనలు ఎలా ఉంటాయో ప్రజలకు ఇంతకు ముందు తెలియదా ? విసన్ 2020 అంటూ అప్పుడే ఆర్భాటాలు జరిపిన నాయకుడు ,ఎక్కడో ఇతర(అమెరికా ,జపాన్ వంటి ) దేశనాయకులను స్వయంగా వెంటుండి అభివృద్ధి వైపు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడిది కాదంటారా ? కృషి లేదంటారా ? తాను పదవిలో ఉన్నప్పుడు కక్ష పూరిత రాజకీయాలకు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉన్నాడు కదా ? 

తండ్రి చనిపోయిన రోజే సంతకాల సేకరణ చేయించిన ఈ జగనా నాయకుడు ? తండ్రి అహయాంలోనే ఎన్నో వేయిల కోట్ల రూపాయల వ్యాపారాల వంకతో రాష్ట్రాన్ని ,దేశాన్ని  లూటిచేస్తే ఇంకా చాలు నయినా చేసింది చాలు ,దోచింది చాలు అని అన్న తండ్రి మాటను విన్నట్టుగానే, విని, లేపేస్తివి ,ఆ వెంటనే రాజకీయా నాటకాలకు కొత్త తెరలేపవయా సంతకాల సేకరణ అంటూ ఎవ్వరు చెయ్యని పనికిమాలిన పని చేస్తివి ,ఆది నాటకంగానే మిగిలి పోయే ..... తర్వాతి కాలంలో శ్రీకృష్ణ జన్మస్థలానికి ఆరు నెలలు పోతివి .... ఇక్కడ చంద్రబాబు నాయుడు నీలాగా కక్ష పూరితంగా ఉండుంటే ఇంకా చెక్కభజన చేసోటోనివి అయ్యా ...? కానీ నాయుడు గారు ఉదార వృదాయంతో నాతోటి సహా నాయకుని సుపుత్రుడివి కదా ,అని దయతో వదిలితే నేడు విర్రవీగుతున్నావా?   దోచిన ధనంతో  కాదు నెగ్గింది ,పాపిష్టి సొమ్ముతో కాదు నెగ్గింది ? ఇంకా ధనార్జన ఆశ పోలె ...?అవును మీరన్నట్టు పిచ్చిప్రజలే పాపం పోనీ ఈ సారైనా గెలవనిద్దాం అని జాలి , దయ దలిస్తే ?ఈ రోజు వారిపాలిట యముడిలాగా తయారైయ్యావు కదా ?

ఎన్నో పార్టీలు వచ్చాయి ,పోయాయి కానీ ప్రతి ఒక పథకానికి మీ పేరే పెట్టుకోవడం మాత్రం మీకే చెల్లింది మహా ప్రభు ....... !

ఒక్క సారి ఆలోచన చెయ్యండి ప్రజలారా ,మన కోసం పనిచేసే నాయకున్ని ఎన్నుకొందాం ,ఆది కూడా మన మధ్యన ఉన్న వారిని మాత్రమే ....... ,ఎందుకంటే రాజ్యాంగం,వారు ,వారి పిల్లలకు మాత్రమే నాయకులుగా ఉండాలని రాసిపెట్టలేదు కాబట్టి ,ఇకనైనా వారసత్వ రాజకీయాలకు చర్మ గీతం పాడాలని కోరుతున్నాను ....... 

  


Saturday, April 24, 2021

                                                                మానవత్వం 

భూమి పై జీవం యొక్క మొదటి పరిణామ క్రమం నీటితో మొదలైనదని మన జీవశాస్రం  మనకు తెలియచేసిన విషయం అందరికి తెలుసు , అయితే ఈ క్రమంలో వేయిల సంవత్సరా ల  క్రితం  కోతి నుండి మార్పులు  పొంది ,తర్వాత మనిషిగా మార్పు పొందు ,జీవకోటిలో ఏ ప్రాణికి దక్కని ఒక ప్రత్యేక గుర్తింపును స్వంతం చేసుకున్నాము . 

ఈ క్రమంలో ఎన్నో కొత్త విషయాలు ,కొత్త పోకడలు ,కొత్త రకం ఆలోచనలతో ఈ భూమిపై ఒక ప్రత్యేక గుర్తును ,మనకు మనం ఏర్పాటు చేసుకున్నాము , ఈ క్రమంలో ఎన్నో జయాలు , అపజయాలు , కీర్తిని ,అపకీర్తిని విడదియ్యని భందంగా ఏర్పాటు వాదుల మాయలో పడి  మన ఉనికికే ప్రమాదం తెచ్చుకునే స్థాయికి మనకు , మనమే  సమాధులను ఏర్పాటు చేసుకున్నాము . 

ఇప్పుడు మనిషి వంటి  అతిదుర్మార్గుడైన జీవి ఇంకొకటి ఈ భూమి పై లేదని చెప్పకనే ,చెప్పుతూ ప్రపంచ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోబోతున్నాము ,ఇది చాల విచారించే విషయం అయినప్పటికీ  విచారించ లేకపోవటం విడ్డురంగా ఉంది కదూ ...  

అవును మరి  ఎప్పుడో జరిగిన రాముడి కథను ,కథలు కథలుగా చెప్పుకొనే స్థితి నుండి మనిషిగా మనం మనుషులం అని  చెప్పుకోవటానికి  తప్ప ,ఆచరించటానికి  గాని , వ్యక్త పరచటానికి  గాని  స్వాతంత్రం మాత్రం కోల్పోయామని ,కోల్పోతామని కానీ ,గ్రహించ లేకపోవటం గమనార్హం .

విధి ఎప్పుడు బలీయహం అని పెద్దలు చెప్పిన మాటగా గుర్తుంచుకోవటం మర్చిపోవద్దని, వారు నెత్తి నోరు మొత్తుకున్నా మనం వినంకదా ? వింటే  మనం మనుషులం ఎందుకు అవుతాం  కదా ? విశ్వంలో మనిషికి ఒక ప్రత్తేక గుర్తింపు ఉంది ,దీనిని ఎంత వరకు మనం నిలబెట్టుకోగలమో వేచి చూడాలే ..... 

జీవ కోఠిలో కొన్ని సంవత్సరాలకు ఒక మారు జీవం యొక్క ఉనికి , ఒక కొత్త  జీవిగా ఆవిర్భవించి రేపటి జీవానికి నాంది పలుకుతుందని అందరికి తెలుసు ,అయినా దీన్ని ఎవ్వరు అంగీకరించ లేరు ,ఎందుకంటే స్వార్థం ఎక్కువైంది కాబట్టి . విశ్వంలో మార్పును అంత సులభంగా అంగీకరించక పోవటం కూడా ఒక లోపమని తెలియదు కాబట్టి . 

నిన్నటి వరకు ఈ  విశ్వాన్ని ఏక చేత్య్రాది పతిగా ఏలిన డైనోసార్స్ కూడా ,మనకు ఒక శిలాజాలుగా మిగిలి పొయ్యాయి కానీ ,అంతకు మించి ఎటువంటి గుర్తింపును ఉంచుకోకుండా పొయ్యాయి ,అంటే అన్ని సంవత్సరాలు ఈ భూమిని ఏలిన జీవాలు కూడా ఎముకుల గూడును మాత్రమే మిగిల్చి వెళ్లిపోయాయి అంటే ,ఇక ఆ తర్వాత తరానికి చెందిన మనం ఎంత వరకు కాలం పరీక్షలకు నిలబడగలుగుతామంటారు.....  ?

దీంట్లో అంతర్ యుద్ధాలతో ,మనలో మనం తన్నుక చావలేదా ,మన వారిని , పక్క వారిని కోల్పోలేదా ? రాజులూ ,రాజ్యాలు ,పొయ్యాయి ఇక మిగిలింది కరోనా వంటి మహమ్మారివి,  బయోవార్లను మనం తట్టుకొని నిలబడి బ్రతికి బట్టగలమా  ? ఇంకా ఎన్ని ఉపద్రవాలను చూడాలంటారో ... అంతే మరి ఎవ్వరు తీసుకున్న గోతిలోకి వారే వెళ్ళాలి కదా ?

పరియావర్ణాన్ని నాశనం చేసుకుంటూ పోయి ఇప్పుడు ఎంత మొత్తుకున్నా ఏమి లాభం మరి ? రేపటి భావి తరానికి మూడు ఆక్సిజన్ సిలిండర్లు ,ఆరు అణుబాంబులను అందించక తప్పదేమో మనం ... ఇవ్వితప్ప మన దగ్గర ఏమి మిగిలి ఉండే అవకాశం లేదని చెప్పొచ్చు ... ఇక డబ్బులు ,ఆస్తులు ,అంతస్తులు ఎన్నికాపాడుతే మన పిల్లలు అంత ఆనందంగా ఉంటారని అపోహ మాత్రం పోదు సుమీ ..... రాజులు ,రాజకీయా నాయకులూ దేశం ఏమైపోతే మాకేంటి మా పిల్లల భవిషత్తు కు కావాల్సింది మాత్రం డబ్బేనని గట్టిగా నమ్మినాన్నీ రోజులు ఈ ఉచిత పథకాలు ఉన్నన్ని రోజులు మార్పు రాదు .  ఎన్ని డబ్బులు ఉన్న ఏ ప్రపంచం పారి పోయిన అక్కడ కూడా ఇదే మనుషులు ఉంటారని గమనించక పోవటం విడ్డురం కదా ?

ఇప్పటి మట్టుకు కోట్లు కూడపెట్టడం మాత్రం మరువరు కానీ , వారు కానీ వారి పిల్లలు కానీ ఏ దేశం , ఏ రాష్ట్రం పోయిన ఇదే పరిస్థితి అని గ్రహంచిన  నాడు మనిషి ఏమి దాచుకోకుండా ఉంటాడని నమ్ముదాం .... కాబట్టి ... 

మనిషి కి  ఆయుష్షు తీరిన నాడు ఏ డబ్బు ,దర్పం వెంట రావని గ్రహిస్తే అంత సుఖం ... 


Saturday, February 20, 2021

                        షర్మిల(షేమ్ ) రాజకీయాలు స్టార్ట్ చేస్తుంది  

వారసత్వ వ్యహారాలకు (వారసత్వ రాజకీయాలు,రాజరిక వారసత్వాలు ,వారసత్వ ఉద్యోగాలు  వంటివి )తీవ్రంగా వ్యతిరేకించే రాజకియ్యా మేధావులు,మరి ఇప్పుడు జరుగుతుంది ఏమిటి ? వారసత్వ నాటకాలకు వత్తాసు  పలకటం విడ్డురంగా లేదా ? ప్రాంతాల వారీగా ,భాష ల వారీగా దేశాన్ని విచ్చల విడిగా విడగొట్టి వారి పబ్బం గడుపుకొంటున్న నీతి లేని నాయకులు ఉన్నన్ని రోజులు ప్రజల పై భౌతిక ,మానసిక దాడులు అను నిత్యం జరుగుతుంటాయని మనం గమనించాలి . 
వారసత్వాన్ని ఇష్ట పడే వారు , పూర్వం నుండి వస్తున్న వారసత్వ రాజరిక రాజ్యాన్ని ఎందుకు వ్యతిరేకించారు ? 
ఆంధ్రప్రదేశ్ లో అతి కిరాతంగా  కులాల పేరిట జరుగుతున్న భౌతిక దాడులు , వ్యక్తిగత రాజకీయా కక్షలతో ,ఉద్దేశిత పూర్వకంగా దాడులకు దిగుతూ ,ప్రజల మనోబావాలతో ,స్థిరాస్తులపై, దేవాలయాల పై, దాడులకు దిగుతూ ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురిచేయ్యటం లేదా ? ఎక్కడో ఒక దేశంలో   పుట్టిన పరాయి మతం వాళ్ళు ,వీళ్ళు  కాదా ? 
ప్రజలు ఉన్నట్టుగా రాజకీయా నాయకులూ అమాయకులు కాదు కదా ? అయ్యో రెండు మార్లు సీఎం పదవికి పోటీచేసి ఓడిపోయి తినటానికి ,ఉండడానికి ఇల్లు లేక అతి దరిద్రానికి దగ్గరి బంధువై ఆఖరి బంధువై జీవకళ లేకుండా ఉన్నాడని ,జాలి తో ,దయతో ,మాజీ ముఖ్య మంత్రి కుమారుడు మరీను అంటూ ,ఓట్లేసి గెలిపిస్తే ??????
ఈ ముఖ్యమంత్రి పదవి మల్లి రాదు , రాబోదు అని అనుకోని చిల్లర రాజకీయాలకు పునాది రాళ్లు గట్టిగా ఉండాలని ,ఎక్కడ ,ఎంత దొరికితే అంతా దోచుకోండని తన అనుచరులకు వత్తాసు పలుకుతూ వెనుకాల ప్రజల ప్రాణాలకు గోతులు తొవ్వుతూ ఆనంద0గా రాజా భోగాలు అనుభవిస్తూ ప్రజల మాన ,ప్రాణాలపై పైశాచికంగా బ్రతుకు దెరువు గడుపుకుంటున్న ఒక పదవీ మదం పట్టిన దౌర్భాగ్యుడు (దౌర్భాగ్యులు ). 
అలాంటి ఖైదీ కి వాతారసత్వాని అందించడానికి అక్కడ అన్న,ఇక్కడ చెల్లెలు ప్రజలను భయ బ్రాంతులకు గురి చెయ్యాటానికి తెలంగాణలో తిష్ట వెయ్యాటానికి పావులు కదుపుతుంది . దానికి ఇక్కడి వారు సపోటా చెయ్యటం విడ్డురం మరి ??పూర్వ రాజకీయాలు ఏ పార్టీకి అయితే తన సపోట్ ఉంటాదో అదే పార్టీలో జీవితంలో మొత్తం దాన్లోనే ఉండేవారు ,మరి ఇప్పుడు ? ఉదయం పూట ఒక పార్టీలో ,సాయంత్రం పూట ఇంకో పార్టీలో వారికి కావాల్సింది పదవి ?,అది వారికి రాలేదంటే, ఎక్కడ తనకు అనుకూలంగా ఉంటుందో అక్కడ రెక్కలు కట్టుకొని మరి వాలుతారు మన రాజకీయా వారసులు ?
షర్మిల రాజకీయా ప్రస్తానం అన్న ఖైదీ నుండి మొదలయిందని చెప్పొచ్చు ? కాదా ? అయితే అన్న పాద యాత్ర మధ్యలో ఆగిపోవడంతో ,తాను దాన్ని ఈవిడ కొనసాగించారు అయితే ఇప్పుడు అన్నకు వ్యతిరేకంగా,షర్మిల ప్రవర్ధన ఉందంటూ వస్తున్న వార్తలు, పూర్తిగా తప్పుడు ప్రచారం అది , దాన్నికావాలని  పబ్లిసిటీ చేసుకుంటున్నది స్వతహాగా వారే,  కారణం ఆంధ్ర ముఖ్య మంత్రి కి ,మన సీఎం గారితో ఉన్న సంబంధాలని తెలిసి చెడకొట్టుకోవడం ఇష్టం లేక చేల్లెలిని రంగంలోకి దించటం జరిగింది ,దీనికి అన్న ,చెల్లెలికి మధ్య పోరు జరుగుతుందని ప్రజల్లో సానుభూతిని పొందాటానికి మాత్రమే ఈ నాటకం . 
అన్న సీఎం కాక ముందే లక్షల కోట్ల డబ్బులు ,ఆస్తులు బాగానే కూడబెట్టాడని అందరికి తెలిసిన విషయమే ? కానీ ఇప్పుడు చెల్లెలు అత్తారింటి పేరును కూడా కనీసం చెప్పుకొని షర్మిల ? వైస్ కూతురిగా రాజకీయాలను చెయ్యటానికి తెలంగాణలో పాగా వెయ్యటానికి పావులు కదుపుతుంది మరి ? అక్కడ సంపాదించిన ఆస్తులు సరిపోవని  బ్రదర్ అనిల్ , షర్మిల చెమటోర్చి కష్టపడటానికి పక్క రాష్టాలు కావలెను... మరి ! దీనికి అన్ని విధాలా సహాయ సహకారాలను అందించాటానికి సదా సిద్ధంగా ఉండే అమ్మ , సీఎం లు అండగా ఉండగా భయమెందుకు కదా ? ఉన్న రాష్టాO  సరిపోవటం లేదని పక్క రాష్టాలకు గాలి సోకుతుంది జాగ్రత్త సుమీ ...... !
                                             జై హింద్