Thursday, May 20, 2021

                                               జగన్ కు  జైలు అనుభవం ఉంది కదా  ?

రాజకీయా చదరంగంలో అందరు ఎదో ఒక రోజు  పావులు కావల్సిందే , దాంట్లో ఎవ్వరు ఎంత నష్టపోయారనడానికి   కాలమే జవాబు చెబుతుంది ?. పూర్వ కాలంలో రాజులు ,రాజ్యాలు ,మణులు ,మాణిక్యాలు ,వజ్ర వైరూఢ్యాలు కాల గర్భంలో కలిసి పోయాయి  దీనికి ప్రత్యేక్ష నిదర్శనం గతం తాలూకా రాజభవనాలు , మొండి (సగం పడిపోయిన గోడలు )గోడలు మిగిలాయని చరిత్ర నేర్పిన పాఠం, మనకు ఇది పుస్తక జ్ఞానం అని అనుకున్న సరే ఆధారాలతో తెలియ చేస్తున్న మన చరిత్ర పాఠాలు . 

నిన్నటి వైభవం ,రేపటి ఒట్టి మట్టిదిబ్బ అని తెలిపిన కాలాన్ని ఇంకా మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం ? కాదు ,కాదు జనం మనం  అర్థం చేసుకోవట్లేదు కానీ నాయకులూ బాగా అర్థం చేసుకున్నారు కాబట్టే , దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కపెట్టుకోవాలని అందినంత వరకు దోచుకోవడం మొదలెట్టారు మరీ ను ....... ఇది నీతి ...... న్యాయం కూడా !

జాతి అహంకారంతో ,ప్రాంతాలు ,భాష వంటి కారణాలతో మారణ కాండలు జరిపించినటువంటి ఈ లీడర్లను ఇంకా నమ్మి మోసపోవటం మన జన్మ హక్కు అంటూ వారివెంట ,వారి కుటుంబ సభ్యుల వెంట కుక్కల వలె  విశ్వాసంగా ఉంటున్నాం కదా ? ఇక్కడ ఇంకోటి గమనించాలి మనందరం    కుక్కలమంటూ బహిరంగంగా నే విమర్శించినటువంటి నాయకుల వెంట ఉన్నన్ని రోజులు మనకు మంచి రోజులు లేవని గమనించాలి ..... 

నేనే ముఖ్యమంత్రినని విర్రవీగి కక్ష పూరితంగా అందరిని జైల్లో తోసెయ్యటం సరైన పద్ధతేనా నాయకా? రాష్ట్రము మొత్తం భయబ్రాంతులకు గురై పనులను చేసుకొనిపోతున్నారు కాదయ్యా ?అవును లే, గత జైలు జీవితం గుర్తొచ్చిందా ఏమిటి , అది ప్రజా సొమ్ము లక్షల కోట్ల రూపాయలు కాజేసినందుకు జైలుకెళ్లారు మరి ,వీరేమి చేసారు నాయకా ? నీయమ్మ మొగుడా అని అరిచే అనిల్ గారికి ఎంత మంది అమ్మమొగుళ్ళున్నారో మరి ? ఇటువంటి దరిద్రం గొట్టు మాటలు వినాల్సివస్తున్నందుకు ,మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్నాం అని సిగ్గుకే సిగ్గుపడేలా చెయ్యకండి ..... 

భీష్ముడి వంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిండు సభలో అతి గోరంగా అవమానించటం ఎంతవరకు సమంజసం, ఈ అధికారంలో ఉన్న నాయకులకు ? చంద్రబాబు నాయుడు వంటి అనుభవం ఉన్న నాయకుడి ఆలోచనలు ఎలా ఉంటాయో ప్రజలకు ఇంతకు ముందు తెలియదా ? విసన్ 2020 అంటూ అప్పుడే ఆర్భాటాలు జరిపిన నాయకుడు ,ఎక్కడో ఇతర(అమెరికా ,జపాన్ వంటి ) దేశనాయకులను స్వయంగా వెంటుండి అభివృద్ధి వైపు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడిది కాదంటారా ? కృషి లేదంటారా ? తాను పదవిలో ఉన్నప్పుడు కక్ష పూరిత రాజకీయాలకు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉన్నాడు కదా ? 

తండ్రి చనిపోయిన రోజే సంతకాల సేకరణ చేయించిన ఈ జగనా నాయకుడు ? తండ్రి అహయాంలోనే ఎన్నో వేయిల కోట్ల రూపాయల వ్యాపారాల వంకతో రాష్ట్రాన్ని ,దేశాన్ని  లూటిచేస్తే ఇంకా చాలు నయినా చేసింది చాలు ,దోచింది చాలు అని అన్న తండ్రి మాటను విన్నట్టుగానే, విని, లేపేస్తివి ,ఆ వెంటనే రాజకీయా నాటకాలకు కొత్త తెరలేపవయా సంతకాల సేకరణ అంటూ ఎవ్వరు చెయ్యని పనికిమాలిన పని చేస్తివి ,ఆది నాటకంగానే మిగిలి పోయే ..... తర్వాతి కాలంలో శ్రీకృష్ణ జన్మస్థలానికి ఆరు నెలలు పోతివి .... ఇక్కడ చంద్రబాబు నాయుడు నీలాగా కక్ష పూరితంగా ఉండుంటే ఇంకా చెక్కభజన చేసోటోనివి అయ్యా ...? కానీ నాయుడు గారు ఉదార వృదాయంతో నాతోటి సహా నాయకుని సుపుత్రుడివి కదా ,అని దయతో వదిలితే నేడు విర్రవీగుతున్నావా?   దోచిన ధనంతో  కాదు నెగ్గింది ,పాపిష్టి సొమ్ముతో కాదు నెగ్గింది ? ఇంకా ధనార్జన ఆశ పోలె ...?అవును మీరన్నట్టు పిచ్చిప్రజలే పాపం పోనీ ఈ సారైనా గెలవనిద్దాం అని జాలి , దయ దలిస్తే ?ఈ రోజు వారిపాలిట యముడిలాగా తయారైయ్యావు కదా ?

ఎన్నో పార్టీలు వచ్చాయి ,పోయాయి కానీ ప్రతి ఒక పథకానికి మీ పేరే పెట్టుకోవడం మాత్రం మీకే చెల్లింది మహా ప్రభు ....... !

ఒక్క సారి ఆలోచన చెయ్యండి ప్రజలారా ,మన కోసం పనిచేసే నాయకున్ని ఎన్నుకొందాం ,ఆది కూడా మన మధ్యన ఉన్న వారిని మాత్రమే ....... ,ఎందుకంటే రాజ్యాంగం,వారు ,వారి పిల్లలకు మాత్రమే నాయకులుగా ఉండాలని రాసిపెట్టలేదు కాబట్టి ,ఇకనైనా వారసత్వ రాజకీయాలకు చర్మ గీతం పాడాలని కోరుతున్నాను .......