Saturday, April 24, 2021

                                                                మానవత్వం 

భూమి పై జీవం యొక్క మొదటి పరిణామ క్రమం నీటితో మొదలైనదని మన జీవశాస్రం  మనకు తెలియచేసిన విషయం అందరికి తెలుసు , అయితే ఈ క్రమంలో వేయిల సంవత్సరా ల  క్రితం  కోతి నుండి మార్పులు  పొంది ,తర్వాత మనిషిగా మార్పు పొందు ,జీవకోటిలో ఏ ప్రాణికి దక్కని ఒక ప్రత్యేక గుర్తింపును స్వంతం చేసుకున్నాము . 

ఈ క్రమంలో ఎన్నో కొత్త విషయాలు ,కొత్త పోకడలు ,కొత్త రకం ఆలోచనలతో ఈ భూమిపై ఒక ప్రత్యేక గుర్తును ,మనకు మనం ఏర్పాటు చేసుకున్నాము , ఈ క్రమంలో ఎన్నో జయాలు , అపజయాలు , కీర్తిని ,అపకీర్తిని విడదియ్యని భందంగా ఏర్పాటు వాదుల మాయలో పడి  మన ఉనికికే ప్రమాదం తెచ్చుకునే స్థాయికి మనకు , మనమే  సమాధులను ఏర్పాటు చేసుకున్నాము . 

ఇప్పుడు మనిషి వంటి  అతిదుర్మార్గుడైన జీవి ఇంకొకటి ఈ భూమి పై లేదని చెప్పకనే ,చెప్పుతూ ప్రపంచ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోబోతున్నాము ,ఇది చాల విచారించే విషయం అయినప్పటికీ  విచారించ లేకపోవటం విడ్డురంగా ఉంది కదూ ...  

అవును మరి  ఎప్పుడో జరిగిన రాముడి కథను ,కథలు కథలుగా చెప్పుకొనే స్థితి నుండి మనిషిగా మనం మనుషులం అని  చెప్పుకోవటానికి  తప్ప ,ఆచరించటానికి  గాని , వ్యక్త పరచటానికి  గాని  స్వాతంత్రం మాత్రం కోల్పోయామని ,కోల్పోతామని కానీ ,గ్రహించ లేకపోవటం గమనార్హం .

విధి ఎప్పుడు బలీయహం అని పెద్దలు చెప్పిన మాటగా గుర్తుంచుకోవటం మర్చిపోవద్దని, వారు నెత్తి నోరు మొత్తుకున్నా మనం వినంకదా ? వింటే  మనం మనుషులం ఎందుకు అవుతాం  కదా ? విశ్వంలో మనిషికి ఒక ప్రత్తేక గుర్తింపు ఉంది ,దీనిని ఎంత వరకు మనం నిలబెట్టుకోగలమో వేచి చూడాలే ..... 

జీవ కోఠిలో కొన్ని సంవత్సరాలకు ఒక మారు జీవం యొక్క ఉనికి , ఒక కొత్త  జీవిగా ఆవిర్భవించి రేపటి జీవానికి నాంది పలుకుతుందని అందరికి తెలుసు ,అయినా దీన్ని ఎవ్వరు అంగీకరించ లేరు ,ఎందుకంటే స్వార్థం ఎక్కువైంది కాబట్టి . విశ్వంలో మార్పును అంత సులభంగా అంగీకరించక పోవటం కూడా ఒక లోపమని తెలియదు కాబట్టి . 

నిన్నటి వరకు ఈ  విశ్వాన్ని ఏక చేత్య్రాది పతిగా ఏలిన డైనోసార్స్ కూడా ,మనకు ఒక శిలాజాలుగా మిగిలి పొయ్యాయి కానీ ,అంతకు మించి ఎటువంటి గుర్తింపును ఉంచుకోకుండా పొయ్యాయి ,అంటే అన్ని సంవత్సరాలు ఈ భూమిని ఏలిన జీవాలు కూడా ఎముకుల గూడును మాత్రమే మిగిల్చి వెళ్లిపోయాయి అంటే ,ఇక ఆ తర్వాత తరానికి చెందిన మనం ఎంత వరకు కాలం పరీక్షలకు నిలబడగలుగుతామంటారు.....  ?

దీంట్లో అంతర్ యుద్ధాలతో ,మనలో మనం తన్నుక చావలేదా ,మన వారిని , పక్క వారిని కోల్పోలేదా ? రాజులూ ,రాజ్యాలు ,పొయ్యాయి ఇక మిగిలింది కరోనా వంటి మహమ్మారివి,  బయోవార్లను మనం తట్టుకొని నిలబడి బ్రతికి బట్టగలమా  ? ఇంకా ఎన్ని ఉపద్రవాలను చూడాలంటారో ... అంతే మరి ఎవ్వరు తీసుకున్న గోతిలోకి వారే వెళ్ళాలి కదా ?

పరియావర్ణాన్ని నాశనం చేసుకుంటూ పోయి ఇప్పుడు ఎంత మొత్తుకున్నా ఏమి లాభం మరి ? రేపటి భావి తరానికి మూడు ఆక్సిజన్ సిలిండర్లు ,ఆరు అణుబాంబులను అందించక తప్పదేమో మనం ... ఇవ్వితప్ప మన దగ్గర ఏమి మిగిలి ఉండే అవకాశం లేదని చెప్పొచ్చు ... ఇక డబ్బులు ,ఆస్తులు ,అంతస్తులు ఎన్నికాపాడుతే మన పిల్లలు అంత ఆనందంగా ఉంటారని అపోహ మాత్రం పోదు సుమీ ..... రాజులు ,రాజకీయా నాయకులూ దేశం ఏమైపోతే మాకేంటి మా పిల్లల భవిషత్తు కు కావాల్సింది మాత్రం డబ్బేనని గట్టిగా నమ్మినాన్నీ రోజులు ఈ ఉచిత పథకాలు ఉన్నన్ని రోజులు మార్పు రాదు .  ఎన్ని డబ్బులు ఉన్న ఏ ప్రపంచం పారి పోయిన అక్కడ కూడా ఇదే మనుషులు ఉంటారని గమనించక పోవటం విడ్డురం కదా ?

ఇప్పటి మట్టుకు కోట్లు కూడపెట్టడం మాత్రం మరువరు కానీ , వారు కానీ వారి పిల్లలు కానీ ఏ దేశం , ఏ రాష్ట్రం పోయిన ఇదే పరిస్థితి అని గ్రహంచిన  నాడు మనిషి ఏమి దాచుకోకుండా ఉంటాడని నమ్ముదాం .... కాబట్టి ... 

మనిషి కి  ఆయుష్షు తీరిన నాడు ఏ డబ్బు ,దర్పం వెంట రావని గ్రహిస్తే అంత సుఖం ...