Tuesday, July 9, 2024

                                                     ఓట్ల నుండి  కోట్లు ?
2024 కొత్త సంవత్సరం అందరికి ఆనంద౦ , ఒక  కలల హరివిల్లు ,కానీ మనకు మాత్రం ఒక గొప్ప గుణపాఠం ఓటర్ మహాశయునికునికి షరతులతో జీవనం గడపాలి అని మల్లి రుజువైంది . అన్ని ఉచ్చితాలే కానీ అందుకు షరతులు వర్తిస్తాయి ,అన్ని ఉన్నాయి కానీ అల్లుని నోట్లో శని అన్నట్టు ,తిరిగి తిరిగి జనానికి మల్లి కష్టాల కాలం వచ్చింది .
ఎవరో వస్తారని ,ఏమో చేస్తారని ఎదురుచూస్తుండటం ప్రశ్నఅర్హకంగానే మిగిలింది ?.
అన్ని ఉచితాలే , పైన ఆకాశం ,క్రింద భూమి ,నీరు,గాలి,సూర్య కిరణం ఇన్ని ఉత్తిగా వస్తుంటే , ఇంకా ఎన్నో ఉచితంగా కావాలని మన గొంతమ్మ కోరికలు కోరుకుంటూ పోతుంటే చాలానే ఉంటాయి ,ఉన్నాయి..?.
సాధారంగా మనిషి కి కావలిసిన అత్యన్త అవసరం మాములుగా కూడు,గుడ్డ ,గూడు మాత్రమే కావాలని మేధావుల విశ్లేషణ కానీ ,కొత్తగా ఉచిత బస్,ఉచిత బిర్యాని ,ఉచిత మందు ,ఉచిత ఇల్లు ,ఉచిత విద్యుత్ బిల్లు ,రిటైర్ మెంట్ లేని ఉద్యోగం ...లాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి ,ఉంటాయి ...కూడా .
ప్రతి రాజకీయ నాయకునికి ఇవ్వి చాలు ,ఓటర్ ని వాడుకోవటానికి ఇంకేం తరతరాలు నెత్తినెక్కి రాజకీయా నాట్యం చెయ్యటానికి ,వాళ్ళ పిల్లల ,పిల్లలు మన పై పెత్తనం చెయ్యటానికి .
ఉచితాల వల్ల మానవాళికి ఎంతో ప్రమాదమని మేధావుల విశ్లేషణ ,అయినా క్వాటర్ మందుకు ,వంద నోటుకు ఓటు అమ్ముకున్నోడికి ఇది జరగాల్సిందే కదా ?..........? ఒక్క  అవకాశం అంటూ (?).అందరిని అదాపాతాళానికి తొక్కి వేసి ,రాష్ట్ర, దేశ భవిషత్తుని పాతాళంలో ముంచేశాడు , ముంచేశాడు అనేకంటే మనమే ముంచుకున్నాం అని అనటం కరెక్టేమో ? కేవలం ఒక్క,ఒకే ఒక్క ఛాన్స్ అన్నోడు ,మల్లి ఎలెక్షన్ లో ఎందుకు నిలబడ్డాడు ? నిండా స్కామ్ లు , ౩౦,౦౦,౦౦౦ -౦౦ ( ముప్పై లక్షల బాత్ టబ్) మరి చౌకగా లేదు? ఇది ?.
రాజరిక పాలన లో అన్ని కక్షలే కదా ? ఒకడు కొండను తవ్వుతాడు? ,ఇంకోడు చెరువును తొవ్వుతారు ?,ఇంకోడు గుడిని కూల్చుతాడు ? ఇంకోడు భూములను ఆక్రమిస్తాడు ? ఒకడు దౌర్జన్యం చేస్తాడు ? ఒకడు గుటుకా సాంబడు,ఇంకోడు రసికా రాజా ? అన్ని స్కాములే ,అన్నిటికి ప్రజేలే కారకులు అని వాగుతాడు ఒకడు .
ఖనిజాలను దోచిన ,కష్టాన్ని ముంచిన ,ఏమి అనకూడదు మరి ? ఎందుకంటే అయిదు సంవత్సారాలకు ఒక్క సారి మాత్రేమే వచ్చే రాజకీయా భిక్షగాడు కాబట్టి , ప్రజలు అంటే మనం ప్రతి రోజు బిక్షగాళ్ళమే కదా ? ఎన్నికల ముందు ప్రతిరోజు మన ఇంటి కాడి భిక్షగాడు ,ఎన్నికల తర్వాత ప్రజలం (మనం) ప్రతి రోజు బిక్షగాళ్ళమే కదా ?
ప్రతి అయిదు సంవత్సారాలకు ఎన్నికలు ఎందుకు జరుగుతాయో తెలుసా ? కనీసం ఇప్పుడన్నా మంచి నాయకున్ని ఎన్నుకోండని ,కానీ మనం మల్లి తిరిగి వారినే ఎన్నుకొంటాం ? వారి వారసులే నిలబడాలి వారినే గెలిపించుకోవాలి కదా ? మనం ఇంతే ? వారు అంతే ?
ఎన్నికల ముందు ఎటువంటి షరతులు ఉండవు ,కానీ ఎన్నికల తర్వాత అన్ని షరతులే ? ఏ ఉచిత పథకాలు ప్రకటించే ముందు షరతులు గుర్తుకు రావు ? వచ్చిన మనం అడగం ?అడిగిన వారు ఇవ్వరు ,ఇచ్చిన మరునాడు మల్లి తిరిగి ఇవ్వవలసిందే కదా ? పన్ను రూపంలో ?

No comments:

Post a Comment