Friday, September 18, 2020

                        విభజన రాష్ట్రాలకా ? ప్రజలకా ?

రాష్ట్రాల విభజన ఎందుకు జరిగింది ? దానికి గల కారణాలు ఏమిటి ? ఫలితం ఏంటి ? అది ఎవరికీ లాభం ? రాజులనుండి ,నాయకుల నుండి ,ప్రజా పరిపాలన అతి సులువుగా సాగాలని మామూలు ప్రజానీకానికి అతి చేరువులో ఉండాలని  ,అప్పటి రాజులకు గాని ,నాయకులకు గాని అనుకోని ఉండ వచ్చు . అయితే ఇక్కడ వారసత్వ రాజకీయాలు ఉండ కూడదని ,ప్రజా పరిపాలన జన రంజకంగా సాగాలని ,పూర్వం గొప్ప రాజులుగా పేరుపొందిన మహా రాజుల పరిపాలన లాగ ఉంటుందని ,ఉండాలని ఆశ పడ్డారు ,కానీ అది ఒక దేశ భవిషత్తును తిరగ రాస్తోందని అనుకోలేక పోయారు .

సరే ఏది ఏమిజరిగిన ,విభజన జరిగింది . అయితే విభజనకు ముందు ,విభజన తర్వాత కూడా వారి చేతులలో దేశ భవిషత్తు మల్లి ,నాయకుల చేతులలోకి తిరిగి వెళ్లి  పోయింది . మన దేశ భవిషత్తు ఎంతో గొప్పగా ఉండుందని కలలు కన్నా,ఎందరో మహా వీరుల ప్రాణ త్యాగాలు వృధా కాకుండా ఉంటె చాలని కోరుకుందాం !ప్రాణాలను పనంగా పెట్టి సాధించిన స్వాతంత్ర భారతం ఇలా ఉందా ? అని వారి యొక్క ఆత్మా గోషా చాల కఠినంగా గోషిస్తుందని ,ఉంటుందని నాకు బాధాగా ఉంది ,ఇలా రాయాలంటేనే మనస్సుకు అదోలా ఉంది ,కానీ రాయకుండా ఉండ లేక పోతున్నాను .....  ?

భాష ప్రతిపాదికన జరిగిన రాష్ట్రాల విభజన మల్లి ,తిరిగి ప్రాంతీయా రాష్ట్రాలుగా ఎందుకు విభజించడం జరుగుంతుంది ?దానికి కారణం ఎవరు ?ఎందుకు ?ఎవరికీ లాభం ?

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఉన్న నాయకులే ,ఇప్పుడు ఉన్న ఈ నాయకులే ప్రజా నాయకులుగా ఉన్నారు మరి?ఇప్పుడు ఎక్కడికి పోదాం మరి ? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఉన్న ఈ నాయకులూ ఇప్పుడు మంత్రులు ,కేంద్ర మంత్రులు కూడాను ,అయితే ఇక్కడ ,ఇప్పుడు ఎవ్వరిది తప్పు ? ఎందుకు తప్పు ?అప్పుడు ఉన్న పరిస్థితి లో అసెంబ్లీలో కానీ ,పార్లమెంట్లో కానీ ,వీరు ఎందుకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు రాబట్టలేదు ?అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెందించ లేదు ?అప్పుడు పోరాట పటిమా లేదా ? లేక మనకెందుకులే అని నిబ్బరంగా ఉన్నారా ఏమిటి ?మనం మాత్రం సంతోషంగా ఉన్నాం కాబట్టి ,ప్రజలు ఎట్లా పోతే ఏమిటి ?

నాయకులలో ఇప్పుడు అతీ సాధారణ జన జీవనం గడుపుతున్న నాయకులూ  ఎంత మంది ? ఎందుకు సాధారణ జన జీవనం గడప లేకపోతున్నారు ? దానికి గల కారణాలు ఏమిటి ? ఒక్క సారి ఎన్నికలల్లో పోటీచేసిన వ్యక్తి ,మళ్ళి ,మల్లి ఎందుకు పోటీకి సిద్ద పడుతున్నాడు ? మల్లి ,మల్లి రాజకీయా పార్టీలను మారుతున్నాడు ?ఎంత దూరం పోయిన తిరిగి మాత్రం ,పదవి కోసం ఎదో ఒకటి చేసి తిరిగి ,అదికార నాయకునిగా , అంగు ,ఆర్భాటంతో , ప్రజలా ? మమ్మలిని శాసించేది ?అని గర్వ0గా గల్లా ఎగిరేసుకుంటూ , నాకు ఓటు వెయ్యని వాడికి ఉంటుంది చూడు ? అన్నట్టుగా బలంగా ,బలహీనున్నీ  టార్గెట్ చేస్తూ కాలం గడుపుతూ , మాకా కాలపరిమితి ? కాదు అది మీకు ?మాత్రమే !...... 

మీరు ఎట్లాగూ మారరూ ,కనీసం మేమైనా మారుతాము . 

 


   

No comments:

Post a Comment