Wednesday, September 30, 2020

          ఆరోగ్యాబీమా  మరియు జీవిత బీమాలు  అవసరమా ?


సాధారణ జన జీవనంలో ఆరోగ్య బీమా మరియు జీవిత బీమా ఉండితీరాల్సిందే అనేది నేటి తరానికి బాగా తెలిసిన విషయమే ,కానీ దానిని ఎంత వరకు ఉపయోగించుకుంటాము అనేది ప్రశ్న ? స్వంత సంపాదన ఎప్పుడైతే మొదలైందో, స్వంత నిర్ణయాలు కూడా అప్పుడే మొదలయ్యాయి . ఉమ్మడి కుటుంబంలో ఇంటి పెద్ద మాత్రమే నిర్ణయాలు తీసుకునే వారు ,వారి నిర్ణయాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చేవి ,అయితే ఇప్పుడు ఉన్న పరిస్థిల ప్రకారం ఇప్పుడే బాగుంది అనే వాదన కూడా లేకపోలేదు . కానీ వివిధ కుటుంబలా నుండి వచ్చిన వ్యక్థితిత్వాలు రకరకాలుగా ఉంటాయని , అందు వల్లే  ఉమ్మడి కుటుంబాలకు కాలం చెల్లిందని ఇప్పటి వాదన .

అది ఏమైనా, ఇక్కడ బీమా గురించి వివరణ కాబట్టి ,బీమా విషయంను మాత్రేమే పరిశీలింద్దాం . జీవిత బీమా అనేది ఒక వ్యక్తి కి మాత్రమే సంబంధం ఉండదు, తన కుటుంబానికి కూడా సంబంధం ఉంటుంది  ,ఎలాగంటే కుటుంబ పెద్ద జీవిత బీమా తీసుకుంటే ,అనుకోకుండా ప్రాణ నష్టం జరిగితే , తన కుటుంబానికి ఆర్ధిక స్వాలంబన చేకూరాలి కాబట్టి ,ఇక్కడ బీమా వినియోగ దారునికి తన కుటుంబానికి ఒక పెద్ద ఆర్థిక  దిక్కుగా ఉంటుంది ,కానీ కుటుంబ పెద్ద లేని లోటును మాత్రం తీర్చలేనిది. ఇవ్వాళా  చాణక్యుడు చెప్పినట్టుగా  "మానవ సంబంధాలు ,ఆర్థిక సంబంధాలు అని గుర్థించకనే గుర్తించుకోవాలి మరి . 

డబ్బుకు లోకం దాసోహం అనే నానుడి నిజం కాబట్టి ,జీవిత బీమా వినియోగదారుడు ఉన్న ,లేకపోయినా తన కుటుంబ బాధ్యతను నెరవేరుస్తుంది . జీవిత బీమా దారుడు ఒక చందా దారుడిగా ఉంటాడు ,ఒక వేళా జీవిత బీమా కాల పరిమితి మించితే , తన అంగీకారం ప్రకారం పాలసీ ముగిస్తే ,తాను చెల్లించిన వాయిదాల మొత్తం మరియు దానికి గాను వచ్చిన బోనస్ తో కలిపి మొత్తం వినియోగదారునికి చెల్లిస్తుంది ,అలా కానీ పక్షంలో తన నామీనికి పాలసీ మొత్తం మరియు అనుకోకుండా వచ్చే ఆక్సిడెంటల్ బెనిఫిట్ తో కలిపి నామీనికి చెల్లిస్తుంది ,జీవిత బీమా కాలపరిమితి దాటితేనే లేదా ఆక్సిడెంటల్గా జరిగే మరిణామాలకు మాత్రమే చెల్లిస్తుంది . కానీ ఆరోగ్యబీమా మాత్రం కొంచం ముందుగా ఉంటుంది . 

వినియోగా దారుడు చెల్లించిన డబ్బులకు ఆరోగ్య బీమా లో తనకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ,దవాఖాన ఖర్చులు మొత్తం బీమా కంపిని చెల్లిస్తుంది ,ఇది తన హక్కు కూడా అయితే ,తన కుటుంబ పెద్దగా తానే అనారోగ్యాంగా ఉన్నప్పుడు ,ఆరోగ్యానికి అయ్యే ఖర్చులు ఎక్కడినించి రావాలి మరి , తన కుటుంబ సభ్యులు తన ఆరోగ్య విషయంలో కంగారు పడి ,ఒక రకమైన వేదనలో ఉంటారు కాబాట్టి ,అటువంటి క్లిష్ట పారస్థులల్లో వారికి అండగా ఉండేది కేవలం ఒక్క ఆరోగ్య బీమా మాత్రమే . అయితే ఇక్కడ తనకి మాత్రమే కాదు తన కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా రక్షణ ను ఆరోగ్య బీమా కల్పిస్తుంది ,దీనికి గాను వివిధ రకాల బీమా సంస్థలు రకరకాలుగా పాలసీల రూపంలో వినియోగ దారునికి అందుబాటులో ఉన్నాయి . 

కానీ ముక్యంగా మనం ఆరోగ్యాంగా ఉన్నపుడు తీసుకుంటేనే ప్రీమియం మరియు కాలం కలిసి వస్తుంది ,అంటే అనారోగ్యానికి గురి అయితే కొంచం ప్రీమియం పెరుగుతుంది ,మరియు పాలసీ అందుబాటులోకి రావటానికి వెయిటింగ్ పీరియడ్ సమయం రెండు ,లేదా మూడు సంవత్సరాల కాలం ఉంటుంది ,కాబట్టి ప్రతి వ్యక్తి ఆరోగ్య బీమా కలిగిఉంటే ఎంతోకొంత డబ్బులు సంపాదించినవాడు అవుతాడు ,లేని పక్షంలో రాబొయ్యే కాలంలో ఖర్చుల పాలు కాకుండా తప్పదు . 

నష్టం వస్తుంది అనితెలిసి ఏ ఒక్క వ్యక్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడు ,అలాగే బీమా సంస్థలు కూడా అలాగే ఉంటాయి కదా !

జీవిత బీమా వల్ల వినియోగ దారుడు ఉన్నచో పాలసీ టర్మ్ ముగిసిన వెంటనే బీమా మొత్తం మరియు తాను చెల్లించిన వాయిదాలకు బోనస్ కలిపి చెల్లిస్తాయి ,లేదా బీమా వినియోగా దారుడు లేని పక్షంలో తన కుటుంబ లోని నామీనికి మొత్తం డబ్బులు చెల్లిస్తుంది . అయితే వినియోగ దారుడు ఉన్న ,లేక పోయిన బీమా మొత్తం తిరిగి వారికి గాని ,నామిని కి గాని చెల్లిస్తుంది బీమా సంస్థ .అయితే కొందరు వ్యక్తులు తానే లేనప్పుడు డబ్బులు ఉంటె ఎంత ?లేకపోతే ఎంత ? అని వితండా వాదానికి దారితీస్తారు . కానీ తన కుటుంబం ఎంత ఆర్థిక సమస్యల పాలు అవుతారు అని ఊహించలేక పోతారు . అదే ఆరోగ్య బీమా ఆలా ఉండదు ,తాను ఉండాగానే తన యొక్క అనారోగ్యానికి కావాలసిన డబ్బులు హాస్పిటల్ కి నేరుగా చెల్లిస్తుంది , ఇది తాను స్వయంగా చూడగలుగుతాడు కూడా .   





 

No comments:

Post a Comment