Tuesday, September 29, 2020

                       సినిమా వారి సి(విచి )త్రాలు 

మన భారతావని అరువై నాలుగు కళలకు పుట్టినిల్లు ,అందులో ముక్యంగా  నటన  కూడా  ఒక  కళ ,
అన్ని కళలు ఒకటైతే ,సినిమాలోని నటన కళా  గొప్పగా  కలకలాడుతుంది . దానికి  నటన  చేసిన నటులు కావచ్చు,    రాచేయతలు  కావచ్చు . 
ఇక్కడ కళల  రకాల గురించి  కాదు , వాటికి  జరుగుతున్న అన్యాయం  గురించి ,వాటి మీద ఆధార పడి  ప్రాణాలు  గుప్పిట్లో పెట్టుకొని  జీవిస్తున్న కళా కారుల జీవితాల  మీద అసంతృప్తి  వెళ్లగక్కుతున్నాను  . అసంతృప్తి కి  గల కారణం  స్వార్థం తో  నిండిన  కొందరు  నటుల గురుంచి , ఇక్కడ ప్రస్తావించ  దలిచాను . వారు ముక్యంగా  గొప్ప నటులుగా చలామని అవుతున్న నటులు ,వారి  పేర్లు చెప్పాల్సిన అవసరం  లేదని  అనుకుంటున్నాను ,వారి పేర్లు మీకు బాగా  తెలుసును కూడా ,అయితే  అరవై నాలుగు కళలో  ఒక సినీ నటన  మాత్రమే ఎందుకు  ఇంత  ముఖ్య కళ  గా  చలామణి  లోకి వచ్చింది ? పాత రోజుల్లో సినిమా  వేసే శాలలు  అంతగా లేవని చెప్పాలి ,మరి ఇప్పుడు ప్రతి పట్టణంలో కనీసం రెండేసి సినిమా లు వేసే శాలలు కోకొల్లలు .రానురాను నాటకాలకు విలువలు తగ్గి ,దూరదర్శిణిలు ,చలన చిత్రాల ఆదరణ  క్రమంగా పెరుగుతూ వచ్చింది . అవి ఈ నాడు ప్రజల తల రాతలు రాసే స్థాయికి వచ్చి చేరాయి ,అయితే ఇప్పుడు ఉన్న సౌకర్యాలు వేరని చెప్పాలి . మరి తప్పు ఎక్కడ జరింగింది  ? మనుషులలో క్రమంగా డబ్బు పట్ల మోజు పెరుగుతూ  వచ్చి ,వారిని కొన్ని వేయిల కోట్లకు అధిపతులను చేసింది ,క్రమంగా సినిమా  ఒక వ్యాపారం  ,ఒక గొప్ప  హోదా  అని భావిచిన చోట (చిన్న పాటి )నాయకులూ ,సినిమా  సంస్థను వారి కనుసందుల్లో శాసించటం జరిగింది . 
ఈ రోజు  సినీ వీక్షకుల మీద ఆధార పడే నటులు కూడా ,మనకు నాయకులుగా (సీఎం)మారి ,నేడు పలానా  నాయకుడు పీఎం ,సీఎం అవుతారు ,అని సేల వివ్వటం కూడా జరుగుతుంది . కొన్నికోట్ల లక్షల రూపాయలు మన నుండి లాభం పొంది ,నేడు మన దేశం కు వ్యతిరేకంగా ,దేశ భవిశ్యత్తుకు వీ గాథం కలిగించే స్థాయికి వారు వెళ్లగలిగారు అంటే ఎవ్వరిది తప్పు ? వారు తీసిన సినిమాల కోసం ,డబ్బులు ,కాలం ను వృధా చేసుకుంటూ ,కేవలం సినిమా టికెట్ కోసం,వారి పటా లకు  దండలు ,వెయ్యటానికి వెళ్లి ఎంత మంది వారి ప్రాణాలు పోగొట్టుకోలేదు? (తొపులాటలో  ,కరెంటు  షాకు ). 
ఇంత చేస్తే ఈ దేశంలో ఉండాలంటే భయంగా ఉంది ,ఇక్కడ పుట్టడం వృధా అని సొల్లుమాటలు చెప్పుతున్నారు ఈ సినిమా ఆర్టిస్టులు ?ఎందుకు ?వీరా  మన దేశ గౌరవాన్ని కాపాడేది ?
దేశంలో అనుకోకుండా జరిగే ఉపద్రవాలకు ఏ ఒక్కడు స్పందించడు ?కోట్లకు కోట్లు మాత్రం జమ చేసుకొని ఇతర దేశాలకు విరాళాలుగా  (పాకిస్తాను వంటి దేశానికి )  సమర్పించు కుంటున్నారు . వారిలో ముక్యంగా బాలిహూడ్ నటులు కావటం  విశేషం ?
దేశానికి ,దేశ ప్రజల కష్టానికి చలించి కొన్ని కోట్ల రు పాయాలను  విరాళాలుగా ఇచ్చి ,వారి దాతృత్వాన్ని సాటుకున్నారు ,వారిలో  అక్షయ్ కుమార్ ,సోనూసూద్ అని  గొప్పగా చెప్పా వచ్చు . 
నటన లో ఎంతో గొప్ప నటులు ,వారి శేష జీవితాన్ని ఎన్నో కష్టాలతో ,ఆర్ధిక ఇబ్బందులతో  చివరికి కూడు ,గుడ్డ లేకుండా మరణించిన వారు కోకొల్లలు ,అందుకు మీకు తెలిసిన ఉదాహరణ " మహా నటి "గా  గొప్ప పేరు తెచ్చుకున్న సావిత్రి ,రేలంగి ,రాజనాల  వంటి ఎంతో మంది ఉన్నారు ,వారికి అశ్రునివాలులతో ...... కన్నీటి ....... బిందువులు .   

No comments:

Post a Comment