Monday, October 12, 2020

             పదవి వ్యామోహం? ఎవ్వరిది ?ఎప్పటిది ?

రాజకీయ్యంగా  ఎదిగిన వారికి  ,ఎప్పుడు ?,ఎక్కడ ? ఎన్నడూ ?అన్యాయంగా  మోసపోయిన 

దాఖలాలు లేవు ,రాలేవు కూడా . ఎందుకంటే వారికి ఎప్పుడు ,మనం ఎప్పటికి వారి వెంట ఉంటాం అని వారి నమ్మకం ,ఆలాగే వారిని మన బుజాల పై మోస్తూ ఉంటామని వారి బలమైన నమ్మకం కూడా . కానీ  మనకు మాత్రం వారు నమ్మకంగా ఉంటారని గట్టినమ్మకం లేదనే చెప్పాలి ఇక్కడ . 

ఎందుకంటే వారికి ఎంతసేపు వారి పదవిని కాపాడుకోవాడ0లోనే  వారి ఆమూల్యయమైన కాలం గడిచిపోతుంది . వారికి ఎంతసేపు వారికి రావాల్సిన , కావాల్సిన  సౌకర్యాల గురించి  మాత్రమే ఎప్పుడు , వారి దృష్ట్రీ చూస్తూ  ఉంటుంది. సాధారణ మనిషి బ్రతికినట్టుగా దాఖలాలు లేవు కాబట్టి ? వారికీ సకల సౌకర్యాలతో , రాజభోగాలు అలవాటు చేస్తిమి కదా  మనమే (?). 

తాను ఉన్నపార్టీలో కనుక సీటు రాలేదంటే , వెంటనే ఇంకో పార్టీలో చేరిపోవటం ఒక పరిపాటి అయిపొయింది . మరి ఆ పార్టీలో ఉన్నవారి పరిస్థితి ఏంటని మాత్రం అడగొద్దు . కారణం వారి , వారి  ఆర్ధిక పరిస్థితి పైన వారి భవిషత్ ఆధార పడి  ఉంటుంది కాబట్టి  , అది 

అందరికి తెలిసిన విషయమే కదా ? అంటారా .!

అయినా వారికి కావాల్సింది పదవి కానీ ,ప్రజలా ? కాదు ముమ్మాటికీ కాదని చెప్పొచ్చు . 

వారికి ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని సౌకర్యాలకు ,మరియు  వారు దానిని ఒక దర్పంగా ,ఒక హోదాగా  , వారి మదిలో బలంగా నాటుకు పోతింది కాబట్టి ? వారు దానిలోంచి అంత తొందరగా బయటకు రాలేరు కాబట్టి , వారికి వెంటనే పదవి కావలి కాబట్టి , ఇతర పార్టీల వైపు తొంగి చూస్తూ ఉంటారు . అధికారంలో ఉన్నప్పుడు , మంది ,మార్బలం ,వాహనాలు వాటి వెంటా ,సెక్యూరిటీ గార్డులే  , కాకుండా ఫోన్ బిల్లు ,కారు బిల్లు ,ఇంటి బిల్లు ,వాటర్ బిల్లు ,ఇంటి మెటనెన్స్ కోసం ఖర్చులకు నగతుగా వారికి చెల్లించటం  మరియు ఆదికారికంగా విదేశీ ప్రయాణాలు ఎక్సట్రా ... ?

ప్రాంతాల వారీగా విడిది చెయ్యటానికి అన్ని సౌకర్యాలతో కూడిన భవనాలు , పార్ల మెంట్లో కానీ , అసెంబ్లీలో కానీ వారికి క్వాలిటీ ఫుడ్ , క్వాలిటీ టీ , క్వాలిటీ ఆఫీస్ రూమ్స్  ఇస్తే , వారు వెలగపెట్టేది , కాల పెట్టేది , అక్కడ ఉన్న మైకులు , బెంచీలు మరియు టేబుల్స్ . 

ఒక సభను నడిపించటం కోసం గంటకు కనీసం లక్ష ల  రూపాయల కొద్దీ ఖర్చు చేస్తుంటే మనం? , మనం పన్నులు కట్టుకుంటూ పోతే , వీరు వెలగపెట్టేది ఇది ! 

రాజకీయాన్ని ఒక చదువు గా , ఉద్యోగానికి ఎన్ని షరతులు ఉంటాయో ,మిలటరీలో ఎన్ని కస్టాలు ఉంటాయో ,ఒక IAS ,IPS కు ఎన్ని కండిషన్స్  ఉంటాయో ,అన్ని నియమాలు ఉన్న నాడు కానీ , ఉద్యోగానికి విధించే నియమాలు అన్ని, వారి పూర్వ చరిత్ర మరియు ముందు చరిత్ర  ను ( ఉద్యోగార్తి కి  క్రిమినల్ మరియు సివిల్ కేసులు ఉన్నాయా ? అని తెలుసుకొని వారికి ఉత్తమమైన ప్రవర్తన ఉంటేనే  ( certifay ) ఉద్యోగానికి అర్హుడుగా ప్రకటిస్తారు కాబట్టి , 

రాజకీయా నాయకులకు కూడా పైవి అన్నిషరతులు వర్తిస్తాయి అని లోగో పెట్టాలని కోరుకుందాం . 

జై   భారత్ మాత ! 

No comments:

Post a Comment