Friday, October 9, 2020

       అవసరమా  ?  ఈ  L R S   ( Layout Regularisation Scheme ) లు  కాదా  ?    

మధ్య తరగతి వారు ,దిగువ తరగతి వారు రూపాయి, రూపాయి కూడపెట్టి , కొన్ని సంవత్సరాలు  మొత్తం కష్ట పడి కూడపెట్టిన ప్రతి పైసా ను ,ఒక్క దగ్గరికి తెచ్చుకొని ,స్వంత ఇంటి కలను నెరవేర్చుకుందామనే ఆలోచనతో మున్సిపల్ అనుమతి లేకుండా ఉన్న ప్లాట్స్ ను అమాయకంగా  కొనుగోలు చేసుకున్న వారికి ఇది(LRS ) ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు . అయితే ఇక్కడ విషయం అది కాదు . 
DTCP అనుమతి లేకున్నా ఇంటి స్థలాలను కొన్నటువంటి వారు మోసపోయినట్టి వారే , ఆలాగే వారు కొన్నటువంటి ప్లాట్ వద్దకు నీటి ,మరియు మురుగు కాలువలు ఆదికారికంగా ఉండాలంటే, వారు ఆదికారికంగా చెల్లుపాటు అయినా ప్లాట్ లను కొనాలి కాబట్టి , జరిగిన తప్పుకు ,దిద్దుపాటు చేసుకోవటానికి ఈ(LRS ) అవకాశం మంచిది,సైరైనది కూడా . 
మరి ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకున్న వారు ధన్యులు , మరియు లీగల్ గా కూడా సపోటుగా ఉంటుంది . 
ఇక్కడ తప్పు ఎవ్వరిది రిజిస్టర్ దా  ? ప్రభుత్వాలదా ? లేక ప్రజలదా ? అందరిని తప్పుతోవ పట్టించిన రియల్ వ్యాపారులదా ? ఎవ్వరిది తప్పు ? 
ఈ తప్పులకు నష్ట పరిహారం ఎవ్వరు కట్టాలి  మరి ? ఎందుకు కట్టాలి మరి ? రియల్ వ్యాపారుల ? గౌర్నమెంట్ ఉద్యోగస్తులా ? కాదు , కాదు (?). ముమ్మాటికి సాధారణ ప్రజలదే కదా ? వినబడిందా ?                                                                  

No comments:

Post a Comment