Saturday, October 17, 2020

                  అతివృష్టి ,అనావృష్టి 

లోతట్టు ప్రాంతాలను ,కుంటలను ,చెరువులను  ఆక్రమించుకోవడం వల్ల ఇటువంటి ఉపద్రవాలకు దారితీస్తుందని తెలుసుకోండి  (?) , తెలుసుకొని మల్లి ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకోవడం వల్ల ఇంతటి నష్టం జరగదని గమనించండి . మరి ముక్యంగా  పరియవరణాన్ని రక్షించండి , అప్పుడు మాత్రమే ఇటువంటి అతివృష్టి , అనావృష్టిల  నుండి కాపాడుకోవడం మాత్రమే మిగిలింది మనకు . కనివిని ఎరుగని వర్షాల వల్ల  ప్రజల జన జీవనం అస్త వ్యస్తం అయిందనే  చెప్పాలి , విరివిగా కురుస్తున్న వర్షాల వల్ల సాధారణ ప్రజల జీవనం అగమ్యగోచరంగా మారింది , ఇది ఎవ్వరి చేతులలో లేదని , ఉండదని అందరికి తెలిసినప్పటికీ  ఏదో ఒక పార్టీ పై నింద  మోపడం అందరికి అలవాటైన మాటలే , ఇక్కడ విషయం అదికాదు , ఇక్కడ వర్షం గురించి మన  సంభాషణ  . 
అయితే గౌర్నమెంట్ వారినో ,అక్కడ ఉన్న నాయకులనో , అందం వల్ల జరిగిన నష్టం తిరిగి వస్తుందా ? రాదు కాబట్టి ,ముందు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం ? అన్నదే విషయం . 
ప్రతిపక్షాలు , ప్రజల పక్షాలు అంటూ వృధా కాలక్షేపాలు చేసే రాజకీయాలే కానీ , ఏ ఒక్కడు తన స్వంత ఖర్చుతో దానం చేసేవారు ,ఇచ్చే వారు తక్కువ , ఒకరి పై ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుకోవటమే తప్ప ఒరిగేది ,చేసేది ఏమి ఉండదనే చెప్పాలి . 
బ్రమ్మస్త్రం వంటి ఓటును , నోటుకు అమ్ముడు పోయేముందు లేని ఆలోచన ఇప్పుడు ఏమి లాభం ?అప్పుడు క్వాటర్ ,సారా ప్యాకెట్ ,బిర్యాని పొట్లం తప్ప ఇంకోటి మన కంటికి కనబడదు , వినబడదు . వినబడ్డ అప్పుడు ఉన్న పరిస్థితిలో పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టే , ఇప్పుడు ఈ పరిస్థికి కారణం కాదా ?
పట్టణంలోని నల్లాలను ,మురికి కాలువలను పట్టించుకోకుండా మనం ,ఇష్టపడి ,కస్టపడి తీసుకున్న స్థలంలో కానీ ,ఎవరో అమ్మిన వంపు ప్రాంతాలను కొని ,ఇప్పుడు ఇన్ని కష్టాల పాలుకావడం ఒక్క ఓటర్ కు మాత్రమే సాధ్యమని వారికి తెలుసు ?కాదా ?ఏమిటి ?. 
ప్రభుత్వంలో నే  ఉన్న MLA ,MP ల నియోజకంలోనే వర్షాల వల్ల నష్టం జరిగిందా ? వేరే ఎక్కడ జరగ లేదా ? మరి ఇంత రాజకీయాలా ? ప్రజా జీవనం పైన ?కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతాలల్లో వర్షాల వల్ల నష్టం జరగ లేదా ?TRS పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతంలో మాత్రమే జరిగిందా ఈ నష్టం ? యాభై  సంవత్సరాలు పాలించిన పార్టీల మాటేమిటి  ? అంతేనా కాదా ? . 
ఇక్కడ జరిగింది ప్రజలకు నష్టం కాబట్టి , వారికి అన్నిపార్టీలు కలిసి ఎంత సహాయం చేద్దామని కాకుండా ,మీరేం చేసారని  వద నలకు దిగి , ప్రజల ముందు పాలనలో ఉన్న ప్రభుత్వాలని ఏండ్డకట్టడం కాదు కావాల్సింది ? ఇప్పుడు టైం కు ఇంత కూడు ,గుడ్డ మరియు నీడ మాత్రమే కావాలి మనకి . 
అతివృష్టి వల్ల కురిసిన వర్షాలకు  నష్ట పరిహారం కోసం , ఉండడానికి ఇంత ఇల్లు ,ఉంటె చాలనుకొనే మధ్య తరగతి మామూలు మనుషులం మనం . 

ఇదం జగత్తు . 

No comments:

Post a Comment