Friday, October 30, 2020

వారసత్వం  కాకూడదు, రాజకీయ్యం  ఎన్నటికీ  ? ఎప్పటికి 

రాజ్యాలు పోయాయి , రాజులూ పోయారు కానీ రాజకీయ్యం
లో వారసత్వం మాత్రం పోలేదు , కారణం ప్రజలా  ?, లేదా నాయకులా  ?
నాయకుల పుణ్యం అంటూ రాజకీయా వాగ్దానాల ? వాటిని పుష్టిగా తింటూ 
సోమరులుగా మారుతున్న మనమా ? ఎవరిది తప్పు . 
రాజుల కాలంలో బ్రతికిన అప్పటి వారు గొప్పవారా ? లేదా ఇప్పటి వారం 
గొప్పవారమా ? రాజుల కాలంలో ఉన్న ప్రజా పాలన ఎలా ఉండేది మరి ?,
వారి పాలనా విధానం ఎట్టిది ? ఎలా ? ఉండేది అది ?

పాలన పరంగా ప్రజల మధ్య కానీ , రాజ్యాల పాలన( రాజులు )  అధికారులు మధ్య కానీ కొన్ని ఆంక్షలు ఉండేవి ,కానీ వారి పాలన విధానం మాత్రం ప్రతి ఒక్కరు శారీరక శ్రమతో, కస్టపడి ,ఇష్టపడి రోజు పనిలో మునిగిపోయి , రాత్రికి ,పగలకి తేడా లేకుండా కష్టంతో కూడిన కూడును ,గుడ్డను సమకూర్చుకొని ఆనందంగా ఉండేవారు . ఇది నిత్యం జరిగే వారి జీవన విధానం . 
అయితే ఇప్పుడు మనకు మాత్రం కనీ , వినీ ఎరుగని రీతిలో ఉత్త పుణ్యానికి ,వివిధ రూపాలలో రకరకాలుగా మన వద్దకు వచ్చి చేరుతున్నాయి , వీటి తో మనం సోమరులుగా మారి , మందులకు ,విందులకు బానిసలుగా మారి , రాజకీయా వాదులకు , నాయకులకు బానిస బ్రతుకు బ్రతుకుతున్నాం . 
మరి ఎవ్వరికి లాభం మరి ? ప్రజలకా ? నాయకులకా ? దేశానికా ? 
చైనా వల్ల కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా నాశనం చేసిందో , ఈ సోమరి తనం వల్ల ప్రజల జీవితాలు కూడా అలాగే నాశనం అయ్యేఅవకాశం చాలా మెండుగా ఉంది . మరి దీని వల్ల లాభం ఎవ్వరికి , ప్రజలు సోమరులు అయితే వారికి ఎదురు ఉండదు , ఇది చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ కంటే ప్రమాదమని గుర్తించక పోవటం చాలా బాధాకరం , దీని పై మేధావుల యొక్క వాదన ఏ మాత్రం లేక పోవటం ఇంకా బాధ కరం , కోపిష్టి కోపం వ్యక్త పరిస్తే నష్టం , కానీ మేధావుల మౌనం చాలా ప్రమాద కరం . దీనికి ఒక జింబావ్బే దేశం గొప్ప ఉదాహారణ . 
కాదంటారా !? 


No comments:

Post a Comment