Tuesday, September 29, 2020
Friday, September 18, 2020
విభజన రాష్ట్రాలకా ? ప్రజలకా ?
రాష్ట్రాల విభజన ఎందుకు జరిగింది ? దానికి గల కారణాలు ఏమిటి ? ఫలితం ఏంటి ? అది ఎవరికీ లాభం ? రాజులనుండి ,నాయకుల నుండి ,ప్రజా పరిపాలన అతి సులువుగా సాగాలని మామూలు ప్రజానీకానికి అతి చేరువులో ఉండాలని ,అప్పటి రాజులకు గాని ,నాయకులకు గాని అనుకోని ఉండ వచ్చు . అయితే ఇక్కడ వారసత్వ రాజకీయాలు ఉండ కూడదని ,ప్రజా పరిపాలన జన రంజకంగా సాగాలని ,పూర్వం గొప్ప రాజులుగా పేరుపొందిన మహా రాజుల పరిపాలన లాగ ఉంటుందని ,ఉండాలని ఆశ పడ్డారు ,కానీ అది ఒక దేశ భవిషత్తును తిరగ రాస్తోందని అనుకోలేక పోయారు .
సరే ఏది ఏమిజరిగిన ,విభజన జరిగింది . అయితే విభజనకు ముందు ,విభజన తర్వాత కూడా వారి చేతులలో దేశ భవిషత్తు మల్లి ,నాయకుల చేతులలోకి తిరిగి వెళ్లి పోయింది . మన దేశ భవిషత్తు ఎంతో గొప్పగా ఉండుందని కలలు కన్నా,ఎందరో మహా వీరుల ప్రాణ త్యాగాలు వృధా కాకుండా ఉంటె చాలని కోరుకుందాం !ప్రాణాలను పనంగా పెట్టి సాధించిన స్వాతంత్ర భారతం ఇలా ఉందా ? అని వారి యొక్క ఆత్మా గోషా చాల కఠినంగా గోషిస్తుందని ,ఉంటుందని నాకు బాధాగా ఉంది ,ఇలా రాయాలంటేనే మనస్సుకు అదోలా ఉంది ,కానీ రాయకుండా ఉండ లేక పోతున్నాను ..... ?
భాష ప్రతిపాదికన జరిగిన రాష్ట్రాల విభజన మల్లి ,తిరిగి ప్రాంతీయా రాష్ట్రాలుగా ఎందుకు విభజించడం జరుగుంతుంది ?దానికి కారణం ఎవరు ?ఎందుకు ?ఎవరికీ లాభం ?
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఉన్న నాయకులే ,ఇప్పుడు ఉన్న ఈ నాయకులే ప్రజా నాయకులుగా ఉన్నారు మరి?ఇప్పుడు ఎక్కడికి పోదాం మరి ? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఉన్న ఈ నాయకులూ ఇప్పుడు మంత్రులు ,కేంద్ర మంత్రులు కూడాను ,అయితే ఇక్కడ ,ఇప్పుడు ఎవ్వరిది తప్పు ? ఎందుకు తప్పు ?అప్పుడు ఉన్న పరిస్థితి లో అసెంబ్లీలో కానీ ,పార్లమెంట్లో కానీ ,వీరు ఎందుకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు రాబట్టలేదు ?అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెందించ లేదు ?అప్పుడు పోరాట పటిమా లేదా ? లేక మనకెందుకులే అని నిబ్బరంగా ఉన్నారా ఏమిటి ?మనం మాత్రం సంతోషంగా ఉన్నాం కాబట్టి ,ప్రజలు ఎట్లా పోతే ఏమిటి ?
నాయకులలో ఇప్పుడు అతీ సాధారణ జన జీవనం గడుపుతున్న నాయకులూ ఎంత మంది ? ఎందుకు సాధారణ జన జీవనం గడప లేకపోతున్నారు ? దానికి గల కారణాలు ఏమిటి ? ఒక్క సారి ఎన్నికలల్లో పోటీచేసిన వ్యక్తి ,మళ్ళి ,మల్లి ఎందుకు పోటీకి సిద్ద పడుతున్నాడు ? మల్లి ,మల్లి రాజకీయా పార్టీలను మారుతున్నాడు ?ఎంత దూరం పోయిన తిరిగి మాత్రం ,పదవి కోసం ఎదో ఒకటి చేసి తిరిగి ,అదికార నాయకునిగా , అంగు ,ఆర్భాటంతో , ప్రజలా ? మమ్మలిని శాసించేది ?అని గర్వ0గా గల్లా ఎగిరేసుకుంటూ , నాకు ఓటు వెయ్యని వాడికి ఉంటుంది చూడు ? అన్నట్టుగా బలంగా ,బలహీనున్నీ టార్గెట్ చేస్తూ కాలం గడుపుతూ , మాకా కాలపరిమితి ? కాదు అది మీకు ?మాత్రమే !......
మీరు ఎట్లాగూ మారరూ ,కనీసం మేమైనా మారుతాము .
Thursday, September 17, 2020
రాజు(సీఎం)లు మారినప్పుడల్లా రాజధానులు మారుతాయా?
రాజాకియ్య చదరంగంలో బలి అయ్యేది మామూలు వారు ,మధ్య తరగతి వారు
మాత్రమే ,కానీ బడా బాబులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు . రాజకీయా నాయకుల ఆర్ధిక వ్యస్థ పై ఎటువంటి వత్తిడి ఉండదు ,పలానా రాజకీయా వేత్త రాజాదాని మార్పు వల్లా సర్వం కోలిపోయిన సంఘటన చాలా తక్కువ . కారణం రాజధానుల మార్పు ,జిల్లాల మార్పు వంటివి వారికే ముందు తెలుస్తుంది కాబట్టి .
సుమారు గా లక్ష కోట్ల రూపాయలు కొత్తగా ఏర్పాటు అయ్యే రాజధానుల ఖర్చు అనుకుంటే , ఈ డబ్బులు గత ప్రభుత్వాలు కేటాయించడం వల్లా రాష్ట్ర ,మరియు దేశ్ ప్రజల పైన ఎంత ఆర్ధిక భారం పడుతుంది ? అయిన ప్రజానీకానికి అవసరం కాబట్టి వాటిని బరించినప్పటికీ ,వారి ఇంటిని , నమ్ముకున్నభూమి తల్లిని కోల్పోయి వారి పిల్లల భవిషత్తు బాగుండాలని కోరుకుంటే ?.
స్వప్రజాయనమే ముఖ్యం అంటూ ,తాజదానిని మారుస్తాం అంటూ ,ప్రజల మనోభావాలను దెబ్బతియ్యటమే కాకుండా ,రాజధానుల దీక్షను హేళనగా చూడటం ఎంతవరకు సబబు ?. అమరావతి వంటి రాజధాని పై ఇన్వెస్ట్ మెంట్ పెట్టినటువంటి ప్రభుత్వ ,ప్రైవేట్ యాజమాన్యాల భవిషత్తు ఎక్కడ ?
దాధాపుగా లక్ష కోట్ల రూపాయల ఖర్చును స్వతహాగా సీఎం గారు భరిస్తారా ?లేక ప్రజల పై భారం వేస్తారా ? జవాబు ఎవ్వరు చెప్పాలి ? వంద రోజుల దీక్ష, జగన్ గారి కంటికి కనపడుట లేదా ,కనపడ్డా ? కనపడనట్టుగా నటిస్తున్నారా ?
దాదాపుగా లక్ష కోట్ల రూపాయల నష్టం ఎలా సమకూర్చుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ,ఇది ప్రజల సొమ్ము కాదా ? కేవలం సీఎం యొక్క సొమ్మా ?ఎంత మంది కష్టం వృధా అవుతుంది మరి?ఎన్నికోట్ల రూపాయలు వృధా అవుతాయి . అయితే కానీ ,నాయకుల సొత్తు కాదు కదా ? అందుకే వారసత్వ రాజకీయాలకు ,ప్రజా సొమ్మును దిగ మింగే ఈ స్వార్థ నాయకులను ఇంటికి పంపించే కాలం రావాలి ,వారికి పూర్తిగా రాజకీయా జీవితానికి అంతిమా చర్మ గీతం పాడాలి !
సీఎం లు మామూలు జన జీవనం గడిపే వరకు ఇంతే !
Thursday, September 10, 2020
Tuesday, December 7, 2010
రాజులు మారిన రాజ్యాలు మారవు
రాజకియ్యం ఓకే వారసత్వం అయ్యింది ఈ రోజులల్లో , ఓకే కుటుంబంలో ఒక్కడు మన్చి వాడు ఐయినంత మాత్రాన కుటుంబ సబ్యులు కూడా మన్చి వారు కావాలని చట్టం లేదుకదా , కాబట్టి వారసత్వ రాజకియ్యలు కాకుండా ప్రజాలు ఎన్నుకో బడిన ప్రజా రాజ్యం కావాలి నేడు ,కాని ఒక్క సారా బొట్టుకు , పచ్చ నోటుకు అమ్ముడుపోయే దుర్మార్గమైన అలవాటు ఉన్నంత వరకు ఈ ఇబ్బందులు పడాల్సిందే .
రాజకియ్య నీలినీడలు ఉండొద్దు అంటే నిజాయితి ఉండాలి , ఒక మామూలు వ్యక్తి ప్రబుత్వం నుండి తీసుకున్న అప్పు ను ముక్కు పిండి లేదా బజారుకు ఈడ్చి మరి వాసులు చేస్తారు ,అదే రాజకియ్య నాయకులు ప్రబుత్వం నుండి తీసుకున్న అప్పును అధికారులు మాత్రం వాసులు చెయ్యలేకే పోతున్నారు . కారణం చట్టం వారికి ఒక చుట్టం కాబట్టి , ఒక రూ$1000/- అప్పుకు ఒక రైతు ఆత్మ హత్యా చేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలకు ఎన్ని అత్యలు చేసుకోవాలి .
దేశంలో ఉన్న నల్ల ధనంను బైటకు తీస్తే దేశం మొత్తం ఒక సంపన్న దేశం ఆతుంది అన్నది ఒక నగ్న సత్యం ,ఈ విషయం ప్రబుత్వానికి కూడా తెలుసు కాని ఏమి చెయ్యలేని వారసత్వ లక్షనమ్ కబాటి తన చేతకాని తనాన్ని పేదవారి పైన చూపిస్తున్నది .దీన్ని ఎవరు కాదనే విషయం .
చట్టానికి హక్కులు లేవమరి ,లేవనే చెప్పాలి కాబోలు ,అటువంటప్పుడు చట్టం లేదనే చెప్పాలి మరి . ఇన్ని ఖర్చులు దండగ ఏ ప్రబుత్వ కార్యలల్లో చుసిన అవినీతి పరుల చిట్టా మాత్రేమే ఉంది ,వీరిని మాత్రం ఏమి చెయ్యలేము అటు ప్రబుత్వం ఇటు మనము,."కొత్త సీసాలో పాత సారాయి"లాగ .(?).
Monday, December 6, 2010
యుగాంతం
సూర్య,చంద్ర్హులు ఉన్నంత వరకు నీ ఖ్యాతి విరాజిల్లుతుంది ,అంటూ త్రేతా యుగంలో రాముడు , ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు ,అటు అన్జనేయునితో ,ఇటు ధర్మరాజుతో అన్న మాటలు ఎవ్వరు మరువరు .
" పుట్టిన వాడు గిట్టక మానదు " అని కొన్ని వందల సంవ్చారాలకు ముందే శ్రీ కృష్ణుడు తన "గీత" లో తెలియచేసాడు . కాబట్టి ప్రతి వస్తువు ,ప్రాణి ,తప్పక అంతరిస్తుందని అర్థమౌతుంది .
భూమి ఆవిర్భావానికి ముందు పెద్ద గోళంగా ఉన్న సూర్యుడు యొక్క విస్పోటనం వల్ల మిలియన్ సంవ్చారాలకు
చల్లబడి ఏర్పడ్డ గ్రహాలూ 9 గా గుర్తించి దానికి అధిపతిగా సూర్యుడు మధ్యస్తంగా ఉంటూ వీటిని కొనసాగిస్తున్నాడు ,ఇయితే భూమి చల్లబడిన తర్వాత మొట్ట మొదటి ప్రాణి నీటి నుండి ఉద్బవంచిన ఏక కణ జీవిగా మన రసాయన ,బౌతిక శాస్త్రాలు తెలియ బర్స్తున్నాయి .
తర్వాత క్రమంలో దినోసార్లూ,వివిధ రకాల మృగాలు వాటి జీవానాన్ని కొనసాగిస్తూ ఉండగా ఉల్కా పాతం వల్ల అవి అంతరించాయి , ఐయితే తర్వాత మార్పులో గొరిల్ల ,కోతి నుండి క్రమంగా మార్పులు జరుగుతూ ,మానవా రూపాంతరం మొదలు అయ్యాయి .
తర్వాత ఆహార శోదనలు మూలంగా , వేటాడడం జరిగి , లింగ భేదం నుండి వర్గ పోరాటం వరకు దారి తీసింది ,ఈ క్రమమును మనం "రాతియుగంగా "పిలుచుకుంటున్నాము .
ఈ మార్పు భావిష్య్యత్తులో మానవుని ఉనికిని పాటపంచలుచేస్తుంది , అన్న విషయం మర్చి పోయి , అభివృద్ధికి గౌరవంగా విర్రవీగడం జరిగి,నివాసాలు,కుటుంబాలు ,ప్రాంతభేదాలు వంటివి మనిషి మస్తిష్కంలో మొదలు,ఆధిపత్యానికి దారి తీసింది .
ఖండాన్తారాలు గా మానవ జాతి విస్తరించటం మూలంగా దేశాలుగా విడిపోయి .
అప్పటి పరిస్థులకు ఒక ప్రాంతంకు ఆది నాయకుడి హస్తంలో ఆ ప్రాంత జీవులు భద్రతభావాన్ని పొందాయి .
రాజులు ,దేశాలంటూ కొత్త ఏర్పాటు రాజ్యాలుగా వెలసిల్లాయి అని చెరిత్ర చెబుతున్న సత్యాలు ,రాముడి యుగం త్రేతా యుగం ,కృష్ణుడి యుగం ద్వాపర యుగం ,యుగాలు చెప్పిన సత్యాలు .
కొన్ని మిలియను సం:లకు ముందు మానవ జాతిని కాపాడి ప్రకృతి తన శాసనాన్ని నిలబెట్టి ,చివరకు అది తన శాసనాన్ని మానవ జాతికి అందించి ,తర్వాత కాలంలో మనిషి కలుషిత స్వభావంతో ,కుళ్ళు,కుతంత్రాలు,ఆశ పూర్వాకంగా "తెలివి" అభివృద్ధి పరుచుకున్తున్నాని ,భ్రమతో మానవత్వం మరిచి రాతి యుగంలో మానవుడు కృరముగాలతో పోరాడడానికి వినియోగించినా ఆయుధాలు,నేడు మనిషి నుండి మనిషి తనకు తానుగా రక్షణ కోసం ఆయుధాలు ధరించి ప్రజా జీవితంలో మృగంగా జీవించడం నిజంగా విచారించ తగ్గ విషయం .
యిల ఐయితే మనకు మిగిలేది ఒత్తి మట్టి దిబ్బలు మాత్రమె , కారణం కాలం ఎన్నటికైనా జీవులను శాసించే స్థాయిలోనే ఉంది,ఉంటుంది.కృత్తిమ వర్షాలు ,మానవ సంబంధాలు ,కృత్తిమ వంగడాలు వాతావరణాలు మొదలైనవి మానవ జీవితాలను ప్రభావితం చెయ్యడం అనేది తప్పని పరస్థితి .
యుగాంతం అనగానే ఏదో భూమి ముక్కలు,ముక్కలుగా విడిపోయి కుంచించుక పోవడమే అని అభిప్రాయం మాత్రం కల్గి ఉన్నారు , కాని పంచభూతాలు వల్ల వచ్చే విపత్తు వల్ల కూడా వచ్చే వైపల్యాలు కూడా యుగాంతం ఒక భాగమే , గాలి వల్ల సైన్ప్లూ ,నీటి వల్ల సునామి ,అతిసార అగ్ని ప్రమాదాలు,అగ్ని పర్వతాలు విస్పోటనం ,అధిక వేడి ,భూ కంపాలు ,ధ్వని కాలుష్యం వల్ల వచ్చే అనర్ధాలు ఎన్నో ఉన్నాయి .ప్రకృతి మనకి కావలిసినా హిమాలయాలు,ఊటి,ఆశ్రామాలు ,వంటి ప్రకృతి సిద్ధ వాతావారణ ప్రాంతాలను కల్పించాడు.కాబాట్టి పర్యావరణ వేత్తలు చెప్పి నట్టుగా ఉంట్టే మానవ మనుగడను మరి కొంచం కాలం సాగించా వచ్చు , అంతే కాని విధి రాతను మార్చే అవకాశం లేదు.
౧) నీటిని అమ్మబడును
౨)అమ్మ తత్వాన్ని అమ్మబడును
౩)చదువును "
౪)రక్తంను "
౫)రక్త బంధాన్ని "
౬)దేశాన్ని తాకట్టు పెట్ట బడును
౭)వావి వరుసలు మరిచి ప్రవర్తించటం జరుగును ౮)కేవలం యంత్రాలను మాత్రేమే నామమును ఈదే భావిశ్శత్తు .
Thursday, May 27, 2010
రాజకియ్య నీలి నీడలు
స్వాతంత్ర సమరంలో ఎందరో మహా మహులు ప్రాణాలు అర్పించి ,వారి భందువులను ,ఆస్తులను ,ఆప్తులను పణంగా పెట్టి సాధించిపెట్టిన ఈ స్వారాజ్యం స్వార్థ రాజకియ్యాల మూలంగా బ్రస్టు పట్టిపోవడం భాధాకరం . నేడు పదవి ఒక హోదా ,ఒక పరపతి వియ్యాలవారికి చెప్పుకోవడానికి చుట్టుంగారక్షకులను నిల్చోపెట్టుకున్ట్టే అదోగోప్ప గర్వం ఈది ఒక రకమైన "ఈగో" గా వ్యసనమైపోయింది . పాలనా పార్టి కి మద్దతు అంటూనే ,ఉపసంహరణ అంటూ అదేరోజు ప్రకటన రావటం వింతగా ఉంటుంది .చూసేవాళ్ళకి లేదా ,చేసే వాళ్ళకి లేదా అన్నట్టుగా ఉంటుంది .దీనికి సమాధానం మాత్రం శూన్యం,ఎన్నికల వల్ల లాభం ఎంతవరకు ఉంటుందో కాని వాటి కర్చు మాత్రం కోట్లల్లో ఉంటుంది మరి దీనికి జవాబుదారుడు ఎవ్వరు.ఇక్కడ కర్చు కోసం ఎన్నికలను విమర్శించటం కాదు కాని ,మధ్యంతర ఎన్నికల వల్లనే ఈ సమస్య ఎదురవుతుంది .ప్రబుత్వాలను కూల్చతమే ఒక ధ్యేయంగా పెట్టుకున్న కొన్ని రాజకియ్య పార్టిలను ఎమ్చేద్ధం అన్న ప్రశ్న తలేతుంది .ఈ మార్పు ఎక్కడకు దారితీస్తుందో మరి .ఎందరో రాజకియ్య నాయకుల్లో కొందరు కనీసం కొంతైనా సహాయం చేద్దాం అన్ట్టే దానికి అధికారుల సహకారం ఉండదు . దేశ ఆర్ధిక వ్యవస్థ ఎక్కడకు పోతుందో మనకే తెలియని స్థాయికి ఎదిగాం , కొందరి రాజకియ్య నాయకుల సంపాదన దేశ ఆర్ధిక వ్యవస్థనే మార్చివేస్తుంది అంటే ఆచర్య పడల్సినా అవసరం లేదుమరి అంతా "రాజ" "కియ్యం".ప్రకృతి సైతం కన్నెర్ర చేస్తుందు మరి జాగ్రత్త సుమీ (సునామీలు & లైలాలు) రావచ్చును .