Thursday, January 28, 2021

             ప్రజా ఉద్యమాలు గతి తప్పుతున్నాయా ...  ?

స్వాతంత్ర భారతావనిలో ఉద్యమాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ,ఖ్యాతి ఉన్నాయి ,అవి ప్రపంచం మొత్తం రాతి యుగంలో మగ్గిన నాడు సైతం ,వివిధ రకాల యుద్ధ నియమాలను ప్రత్తేకతలను ,కలిగిన నవ నాగరికత  అని ఇప్పుడు లభిస్తున్న ఆధారాలను చూస్తుంటే ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అని పరిశోధకుల అభిప్రాయం .

కానీ ఢీల్లీలో జరిగిన రైతుల ధర్నా అలా ఉందా ? ఎదో పక్క దేశాల వారు ,మన దేశం పై దండెత్తి వచ్చినట్టుగా ఉంది . వారికి మందు బాటిళ్లు ,రాళ్ళు ,కత్తులు ఎక్కడనుంచి వచ్చాయి మరి ? వారు ధర్నా చేసినట్టుగా లేదు ,వారందరు పింక్నీక్ కు వచ్చినట్టుగా లేదూ ?వారి వారి బందో బస్తులోభాగంగా ఆయుధాలు ,రాళ్లు,కత్తులు ,మందు బాటిళ్లు మరియు సౌకర్యానికి పరుపులు ,ఫాన్లు అబ్బో అన్ని ఇన్ని కాదు ?భూలోక స్వర్గంగా మార్చుకున్నారు దీక్ష స్థలాన్ని కదా ?

ఎక్సట్రా గా  స్లోగన్లు భారత దేశానికి వ్యతిరేకంగా .... వీళ్లా  రైతులు ? రైతు ఉద్యమంలో ఉన్న వారు నిజానికి రైతులే  ఉన్నారా ? అని ప్రతిపక్షాలు గుండెలపై చెయ్యేసుకుని  చెప్పే దైర్యం ఉందా ఈ నీతి తప్పిన రాజకీయా నాయకులకు ,పార్టీలకు ? 

రైతులు పండించిన పంటలను నేరుగా ,స్వయంగా ఎక్కడైనా ,ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ...?కాదు ,కాదు మా కర్మ ఇంతే మళ్ళి పరాయి దేశస్థుల చేతుల్లోకి మన మాన ,ప్రాణాలను మరియు దేశాన్ని వారి చేతికి అందించాటానికి శత విధాలా కృషిచేస్తున్న మతోన్మాదులకు సహాయ సహకారాలు అందించుకుంటూ  , ఇటు దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు కదరా ... 

సంత(మార్కెట్ )లో  అన్నిరకాల కూరగాయలు దొరికినట్టుగా ,ప్రపంచం మొత్తంలో ఉన్న మేధావులు మొత్తం  కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం అయినప్పుడు ,వారి మేధాస్థును డబ్బులతో కానీ ,ప్రలోభాలకు  కానీ గురి చేసి ,వారివల్ల పొందిన (ఆయుధాలను  లేదా  సంపదను  )ఫలితాలను మా దేశం (అమెరికా ,ఆఫ్రికా ,ఆస్ట్రేలియా ,జపాన్ )వంటివి మాత్రమే కనుగొన గలిగాయి అని డబ్బాను కొట్టుకొనే దేశాలు ఉన్నాయి కదా ?   

                                                               జై  హింద్ 

Wednesday, January 6, 2021

      కుల ,మత మరియు కక్ష పూరిత రాజకీయాలకు మల్లి  తెరలేపిన వైస్ జగన్ గారు 

ఆంధ్ర రాజకీయాలకు మల్లి రంగుల కళ లను  పులమాయిస్తున్నారు , గత చరిత్రకు మల్లి కొత్తగా పునాదులు తీస్తున్నారు ,వేట కొడవళ్లకు ,నాటుబాంబులు మరియు భౌతిక దాడులకు  తెర వెనకాల ఉండి ,ఉద్దేశపూర్వకంగా దాడులు చేపిస్తూ  రాజకీయా నాటకాలకు మొదెలెట్టారు ,వారి తాతల కాలం నాటి  వారసత్వ కక్ష పూరిత రాజకీయాలకు మల్లి ,తిరిగి కొత్తగా కక్ష లను పురిగొలపటం మొదెలెట్టారు . 

టీవీ  బాంబులను , ఇంటిపై వేసే బాంబులను ,కార్ పై వేసే బాంబులను మరియు ఊర్లల్లో బాంబులు వేసి ఊర్లకు ,ఊర్లు మసి చేసిన రోజులను మల్లి తెరపైకి తీసుక రావటానికి శత విధాలా ప్రయంత్నం చేస్తున్నారని అందరికి తెలుస్తుంది కానీ ,ఎవ్వరు మాట్లాడరు అని నిజం . 

ఎందుకంటే నిజం నిప్పులాంటిది కాబట్టి ,ప్రపంచానికి తెలియని  కక్ష పూరిత రాజకీయాలకు ఎంతో మంది నాయకులూ మరియు వారి కుటుంబాలు  అసువులు బాసారని తెలుసా ?దానికి ఆధారాలు మాత్రం అడగవద్దు ?. 

బోసి పోయిన ఊర్లు ,బాంబులు వెయ్య పడ్డ ప్రాంతాన్ని చూడాలి ,తెగిపడ్డ కాళ్ళు ,చేతులను చూస్తే అయినా మనకు తెలుస్తుంది అని ఎంత మందికి తెలుసు ?

ఆంధ్రలో హిందువుల పై జరుగుతున్న దాడులు ,సీఎం జగన్ గారికి తెలియకుండానే జరుగుతున్నాయా ?తెలిసిన తెలియనట్టు నటిస్తున్నారు ,దానికి అధికారం వారిది కాబట్టి అన్ని రకాలుగా  అధికారులు కూడా వారికే అన్ని రకాలుగా సహకరిస్తున్నారని అందరికి తెలిసిన విషయమే కానీ ? ఎవ్వరు మాట్లాడరు  ? కారణం అటు పోయి ఇటుపోయి తనమీదికి  వస్తుందని తెలియదా ?

అయ్యా వైస్ జగన్  గారు   రోజులు మొత్తం మీదే కాదు ? ఒక రోజు అంటూ వస్తుంది ?. అప్పుడు తెలుస్తుంది మీకు ,మిమ్మల్ని చూసుకొని మొరిగే వారిని ప్రపంచం మొత్తం గమనిస్తుంది అని తెలుసుకోండి ? ఏమంటారు మరి జగన్ గారు ? ప్రతి ఆంధ్ర పౌరుడు ఎదురు చూస్తన్నాడు ,కాదంటారా ?

మీ తండ్రి ఆటువంటి  వయస్సు కలిగిన వ్యక్తి ని ,నీ  అనుచరులను తన అనుభవం  అంత  లేని  వయస్సు, నీ  మొరిగే ఆప్తులకు  రెచ్చ గొట్టే మాటలతో  మాటి మాటికీ  వారిని కించ పరుస్తుంటే ,రాక్షస ఆనందాన్ని అనుభవిస్తున్నారు కదా ?

ఏది ఎప్పటికి  శాశ్వితం కాదని మీకు తెలియదు కదా ? ఎంతైనా మీ తండ్రికి  తెలిసినట్టుగా మీకు తెలియదు కదా ?ఇక అధికారం సంగతి అంటారా ? అది మీకు తెలియదు కదా ? 

Tuesday, November 3, 2020

      ఓటర్ చేతిలో దేశ భవిషత్తు (త్తా )? నోటులోనా ? కోటర్  మందులోనా  ?


ఎలక్షన్ కాలమంటేనే అందరికి సంతోషం, ఆనందం కదా ? నోట్ల కట్టలు ,సారాయి ప్యాకెట్లు ,బీరుబాటిళ్ళు మరియు బిర్యానీ పొట్లాలు వీటితో పాటు కులాల ప్యాకేజీలు వంటి బంపర్ ఆఫర్స్ . పోటీదారునికి గెలుపు బాధ , కార్యకర్తలకు పంపాకాల లొల్లి ,గల్లీలీడర్ల కు వాటాల గొడవ , ఇవి అన్ని కాకుండా డబ్బులు పంపించిన వాడికి లెక్కల బాధ . 

దేశ భవిషత్తు ఓటర్ చేతిలో ఉందని ప్రపంచాలు ,దేశాలు గట్టి నమ్మకాలు గా ఉన్నాయి , అయితే నాయకుని ఎన్నిక ఎలా ఉండాలని అంటే మాత్రం పెద్ద ప్రశ్న (?)లాగ ఉంటుంది . ప్రజా నాయకుని ఎన్నిక ఇలా జరిగిన నాడు దేశ భవిషత్ మారుతుందని నా గట్టి నమ్మకం , ఎక్కడ నోట్ల కట్టలు , బంగారం , సారాయి ,బిర్యాని పొట్లాలు ఉండవో అక్కడ నిజమైన నాయకుడు ఉన్నట్టు గా ఋజువు .  

ఓటర్ ఎన్నడు క్లారిటీ వస్తుందో కానీ , క్లారిటీ వచ్చేంత వరకు బ్రతుకు జట్కా బండి మరకలతో , ప్యాచులతో కాలం గడ్డుగా గడపాల్సిందే ? నాయకులూ ఓట్లప్పుడే మన ఊరి దాకా , పొలం దాకా , ఇంటిదాకా , మన దాకా వస్తారని ఎప్పుడుతెలుసుకుంటారో ... ? , ఎలక్షన్స్ తర్వాతా మల్లి కనబడితే పాపం ?, మన ఊరిదాకా రానేరాడు ,వచ్చిన మన చోట ,మోట నాయకులూ ఎక్కడివరకు పోనివ్వరు , ఒక వేళా పోనిచ్చిన నాయకుడి గార్డ్స్ రానివ్వరు . మరి మన నాయకులూ ఇది అంత గమనించి కూడా చూసి చూడకుండా ఉండే మన బడా నాయకుడు (?) , అంతర్లీనంగా తనలో తాను గర్వాంగా ఎన్నికల నాడు మమ్మలిని మీ ఇంటివద్దకు ,పొలం వద్దకు రప్పించుకొని బతిలాడించుకొని , నోట్లకు నోట్లు ,బిర్యాని పొట్లాలు ,సారాయి పొట్లాలు తీసుకున్నాకనే మందులో,మత్తులో మాకు ఓట్లేస్తారా ? అని కసితో మన వంక జాలిగా చూస్తూ ఉంటాడు (?). కాదా ?

ఏ నాయకుడు  ప్రజలకి ప్రతిరోజు అందుబాటులో ఉంటాడో తాను నిజమైన ప్రజా నాయకుడు . మన నాయకులకు కార్లు ,ఏసీ బంగ్లాలు మరియు మనం నాయకుడిని వద్దకు వెళ్లాలంటే  అడ్డుకునే గార్డులను మనమే సమ కూర్చిపెడితే మరి ప్రజలను దగ్గరికి రానివ్వద్దుకదా ?కాదు కూడదు అంటే నాయకుని రక్షణ ముఖ్యం కదా ? అని ఎదురు ప్రశ్న మిగులుతుంది మనకి . 

రక్షణ విషయంలో మాత్రం నాయకులకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని మాత్రం మన ఆర్ధిక గణాంకాల వల్ల స్పష్టత వస్తుంది , గౌరవ మాజీనాయకుడు కోటశ్రీనివాస్ రావ్ గారి మాటల్లో ఏంటంటే ,తాను ఒక టివి కి  ఇచ్చిన ముఖ మూకీ సారాంశం,  మన మాజీ MLA బాబుమోహన్ గారు మంచి గొప్ప నటన నైపుణ్యం కల్గిన నటులు,వీరిద్దరికి మంచి సాన్నిహిత్యం ఉంది కూడా , అయితే మాజీ నాయకుడు కోట శ్రీనివాస రావు గారు ,బాబుమోహన్ రావు గారు ఎదురు పడినప్పుడు నాకు ఉన్నారంటే , నాకు  , ఇద్దరు గన్మెన్స్ అని గర్వాంగా చూపుకుంటూ హేళనగా చూసుకున్నారటా? అంటే ప్రాణ కాపలా దారులు ( రక్షక దళం ) ఒక గర్వానికి , హోదాకి పదవికి చిమ్నంగా వారికి అలవాటుగా , గుర్తింపుగా మారింది , ఇది మన రాజకీయా నాయకుల పద్ధతులు  . 

మరి రక్షణ ఎవ్వరికి అవసరం ఉంటుంది ,నాయకులకేనా ? (నక్షలైట్స్  మరియు ఉగ్రవాదుల వంటి వారితో నిరంతరం పోరాడుతూ ప్రాణాలకు తెగించి )రక్షణ వ్యవస్థలో పనిచేసిన పొలిసు వారికి ,సీబీసీఐడీ ,ఇంటర్ పోల్ ,అతి సూక్ష్మ ,సున్నిత రక్షణ( పాకిస్థాన్ ,చైనా వంటి ) వ్యవస్థలో దేశ భవిషత్తు కోసం ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా ప్రాణాలు వదిలిన వారికి ,ఉద్యోగస్తులకు ఎటువంటి భద్రత కల్పించాం,వారి కుటుంబాలని ఎలా రక్షిస్తున్నాం , ఎలా సమాజంలో వారికి ఉన్న గుర్తింపు ఎలా ఉంది ? అని మనం సమాలోచన చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా ఆలోచన . లేదు గాంధీ వంటి శాంతికామకున్నికాపాడుకోలేక పోయాం ? మరి వీరి పరిస్థితి ఏంటానా ? దీనికి సమాధానం ఎక్కడికి నుండి రావాలి ? ఎప్పుడు రావాలి ?

అతి సాధారణ జన జీవనం ,ప్రజల మధ్య నిరంతరం ఉండే ప్రజా నాయకుని కోసం ఎప్పడికి ఎదురుచూపేనా ? ఎక్కడినుండి రావాలి ? ఎలా రావాలి ? ప్రజా నాయకుడు .?  

మావి గొప్ప దేశాలు అని చెప్పుకునే ఇతర దేశాలు అమెరికా వంటివి , వారి అధ్యక్ష ఎన్నికలకు పోటీచేసే నాయకులూ జీవిత కాలంలో, కేవలం ఒక సారి  మాత్రమే అధ్యక్ష పదవిని అనుభవించే చట్టం అక్కడ ఉంది ,అంటే తన జీవిత కాలంలో ఎప్పుడైనా  అధ్యక్ష పదవిని చేపట్టి, తన పదవి కాలం  ముగిసిన  తర్వాత ,తిరిగి అధ్యక్ష పదవికి తిరిగి పోటీ చెయ్యరాదు అని వారి నిబంధన. మరి మనకు వద్దా ఈ నిబంధన ?

ఒకప్పుడు ఇతర దేశాల ప్రజల ( ఇంజనేర్లు ,డాక్టర్లు ,మేధావులు )మీద ,ఇతర దేశాల సంపద మీద ఆధార పడి ,ఇవ్వాళా గొప్ప దేశం అని  ప్రపంచ దేశాలను గర్వంతో చూసే అమెరికా ,ఇంగ్లాండ్ వంటి దేశాలు వాటి రక్షణ వరకు వచ్చేసరికి , ఇతర దేశాలమీద ఆంక్షలు పెట్టె స్థాయికి ఎదిగింది మరి ? ఇన్ని రోజులు లేని వీసా వంటి వాటిపైన ఆంక్షలు ఇప్పుడే ఎందుకు ? ఆర్ధిక మాంద్యం వల్ల , వారి రక్షణ కోసం ,ఇతర దేశ ప్రజల పై , వారి ఆర్ధిక స్థితి పై భారం మోపుతూ ..... ?

Friday, October 30, 2020

వారసత్వం  కాకూడదు, రాజకీయ్యం  ఎన్నటికీ  ? ఎప్పటికి 

రాజ్యాలు పోయాయి , రాజులూ పోయారు కానీ రాజకీయ్యం
లో వారసత్వం మాత్రం పోలేదు , కారణం ప్రజలా  ?, లేదా నాయకులా  ?
నాయకుల పుణ్యం అంటూ రాజకీయా వాగ్దానాల ? వాటిని పుష్టిగా తింటూ 
సోమరులుగా మారుతున్న మనమా ? ఎవరిది తప్పు . 
రాజుల కాలంలో బ్రతికిన అప్పటి వారు గొప్పవారా ? లేదా ఇప్పటి వారం 
గొప్పవారమా ? రాజుల కాలంలో ఉన్న ప్రజా పాలన ఎలా ఉండేది మరి ?,
వారి పాలనా విధానం ఎట్టిది ? ఎలా ? ఉండేది అది ?

పాలన పరంగా ప్రజల మధ్య కానీ , రాజ్యాల పాలన( రాజులు )  అధికారులు మధ్య కానీ కొన్ని ఆంక్షలు ఉండేవి ,కానీ వారి పాలన విధానం మాత్రం ప్రతి ఒక్కరు శారీరక శ్రమతో, కస్టపడి ,ఇష్టపడి రోజు పనిలో మునిగిపోయి , రాత్రికి ,పగలకి తేడా లేకుండా కష్టంతో కూడిన కూడును ,గుడ్డను సమకూర్చుకొని ఆనందంగా ఉండేవారు . ఇది నిత్యం జరిగే వారి జీవన విధానం . 
అయితే ఇప్పుడు మనకు మాత్రం కనీ , వినీ ఎరుగని రీతిలో ఉత్త పుణ్యానికి ,వివిధ రూపాలలో రకరకాలుగా మన వద్దకు వచ్చి చేరుతున్నాయి , వీటి తో మనం సోమరులుగా మారి , మందులకు ,విందులకు బానిసలుగా మారి , రాజకీయా వాదులకు , నాయకులకు బానిస బ్రతుకు బ్రతుకుతున్నాం . 
మరి ఎవ్వరికి లాభం మరి ? ప్రజలకా ? నాయకులకా ? దేశానికా ? 
చైనా వల్ల కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా నాశనం చేసిందో , ఈ సోమరి తనం వల్ల ప్రజల జీవితాలు కూడా అలాగే నాశనం అయ్యేఅవకాశం చాలా మెండుగా ఉంది . మరి దీని వల్ల లాభం ఎవ్వరికి , ప్రజలు సోమరులు అయితే వారికి ఎదురు ఉండదు , ఇది చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ కంటే ప్రమాదమని గుర్తించక పోవటం చాలా బాధాకరం , దీని పై మేధావుల యొక్క వాదన ఏ మాత్రం లేక పోవటం ఇంకా బాధ కరం , కోపిష్టి కోపం వ్యక్త పరిస్తే నష్టం , కానీ మేధావుల మౌనం చాలా ప్రమాద కరం . దీనికి ఒక జింబావ్బే దేశం గొప్ప ఉదాహారణ . 
కాదంటారా !? 


Saturday, October 17, 2020

                  అతివృష్టి ,అనావృష్టి 

లోతట్టు ప్రాంతాలను ,కుంటలను ,చెరువులను  ఆక్రమించుకోవడం వల్ల ఇటువంటి ఉపద్రవాలకు దారితీస్తుందని తెలుసుకోండి  (?) , తెలుసుకొని మల్లి ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకోవడం వల్ల ఇంతటి నష్టం జరగదని గమనించండి . మరి ముక్యంగా  పరియవరణాన్ని రక్షించండి , అప్పుడు మాత్రమే ఇటువంటి అతివృష్టి , అనావృష్టిల  నుండి కాపాడుకోవడం మాత్రమే మిగిలింది మనకు . కనివిని ఎరుగని వర్షాల వల్ల  ప్రజల జన జీవనం అస్త వ్యస్తం అయిందనే  చెప్పాలి , విరివిగా కురుస్తున్న వర్షాల వల్ల సాధారణ ప్రజల జీవనం అగమ్యగోచరంగా మారింది , ఇది ఎవ్వరి చేతులలో లేదని , ఉండదని అందరికి తెలిసినప్పటికీ  ఏదో ఒక పార్టీ పై నింద  మోపడం అందరికి అలవాటైన మాటలే , ఇక్కడ విషయం అదికాదు , ఇక్కడ వర్షం గురించి మన  సంభాషణ  . 
అయితే గౌర్నమెంట్ వారినో ,అక్కడ ఉన్న నాయకులనో , అందం వల్ల జరిగిన నష్టం తిరిగి వస్తుందా ? రాదు కాబట్టి ,ముందు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం ? అన్నదే విషయం . 
ప్రతిపక్షాలు , ప్రజల పక్షాలు అంటూ వృధా కాలక్షేపాలు చేసే రాజకీయాలే కానీ , ఏ ఒక్కడు తన స్వంత ఖర్చుతో దానం చేసేవారు ,ఇచ్చే వారు తక్కువ , ఒకరి పై ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుకోవటమే తప్ప ఒరిగేది ,చేసేది ఏమి ఉండదనే చెప్పాలి . 
బ్రమ్మస్త్రం వంటి ఓటును , నోటుకు అమ్ముడు పోయేముందు లేని ఆలోచన ఇప్పుడు ఏమి లాభం ?అప్పుడు క్వాటర్ ,సారా ప్యాకెట్ ,బిర్యాని పొట్లం తప్ప ఇంకోటి మన కంటికి కనబడదు , వినబడదు . వినబడ్డ అప్పుడు ఉన్న పరిస్థితిలో పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టే , ఇప్పుడు ఈ పరిస్థికి కారణం కాదా ?
పట్టణంలోని నల్లాలను ,మురికి కాలువలను పట్టించుకోకుండా మనం ,ఇష్టపడి ,కస్టపడి తీసుకున్న స్థలంలో కానీ ,ఎవరో అమ్మిన వంపు ప్రాంతాలను కొని ,ఇప్పుడు ఇన్ని కష్టాల పాలుకావడం ఒక్క ఓటర్ కు మాత్రమే సాధ్యమని వారికి తెలుసు ?కాదా ?ఏమిటి ?. 
ప్రభుత్వంలో నే  ఉన్న MLA ,MP ల నియోజకంలోనే వర్షాల వల్ల నష్టం జరిగిందా ? వేరే ఎక్కడ జరగ లేదా ? మరి ఇంత రాజకీయాలా ? ప్రజా జీవనం పైన ?కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతాలల్లో వర్షాల వల్ల నష్టం జరగ లేదా ?TRS పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతంలో మాత్రమే జరిగిందా ఈ నష్టం ? యాభై  సంవత్సరాలు పాలించిన పార్టీల మాటేమిటి  ? అంతేనా కాదా ? . 
ఇక్కడ జరిగింది ప్రజలకు నష్టం కాబట్టి , వారికి అన్నిపార్టీలు కలిసి ఎంత సహాయం చేద్దామని కాకుండా ,మీరేం చేసారని  వద నలకు దిగి , ప్రజల ముందు పాలనలో ఉన్న ప్రభుత్వాలని ఏండ్డకట్టడం కాదు కావాల్సింది ? ఇప్పుడు టైం కు ఇంత కూడు ,గుడ్డ మరియు నీడ మాత్రమే కావాలి మనకి . 
అతివృష్టి వల్ల కురిసిన వర్షాలకు  నష్ట పరిహారం కోసం , ఉండడానికి ఇంత ఇల్లు ,ఉంటె చాలనుకొనే మధ్య తరగతి మామూలు మనుషులం మనం . 

ఇదం జగత్తు . 

Monday, October 12, 2020

             పదవి వ్యామోహం? ఎవ్వరిది ?ఎప్పటిది ?

రాజకీయ్యంగా  ఎదిగిన వారికి  ,ఎప్పుడు ?,ఎక్కడ ? ఎన్నడూ ?అన్యాయంగా  మోసపోయిన 

దాఖలాలు లేవు ,రాలేవు కూడా . ఎందుకంటే వారికి ఎప్పుడు ,మనం ఎప్పటికి వారి వెంట ఉంటాం అని వారి నమ్మకం ,ఆలాగే వారిని మన బుజాల పై మోస్తూ ఉంటామని వారి బలమైన నమ్మకం కూడా . కానీ  మనకు మాత్రం వారు నమ్మకంగా ఉంటారని గట్టినమ్మకం లేదనే చెప్పాలి ఇక్కడ . 

ఎందుకంటే వారికి ఎంతసేపు వారి పదవిని కాపాడుకోవాడ0లోనే  వారి ఆమూల్యయమైన కాలం గడిచిపోతుంది . వారికి ఎంతసేపు వారికి రావాల్సిన , కావాల్సిన  సౌకర్యాల గురించి  మాత్రమే ఎప్పుడు , వారి దృష్ట్రీ చూస్తూ  ఉంటుంది. సాధారణ మనిషి బ్రతికినట్టుగా దాఖలాలు లేవు కాబట్టి ? వారికీ సకల సౌకర్యాలతో , రాజభోగాలు అలవాటు చేస్తిమి కదా  మనమే (?). 

తాను ఉన్నపార్టీలో కనుక సీటు రాలేదంటే , వెంటనే ఇంకో పార్టీలో చేరిపోవటం ఒక పరిపాటి అయిపొయింది . మరి ఆ పార్టీలో ఉన్నవారి పరిస్థితి ఏంటని మాత్రం అడగొద్దు . కారణం వారి , వారి  ఆర్ధిక పరిస్థితి పైన వారి భవిషత్ ఆధార పడి  ఉంటుంది కాబట్టి  , అది 

అందరికి తెలిసిన విషయమే కదా ? అంటారా .!

అయినా వారికి కావాల్సింది పదవి కానీ ,ప్రజలా ? కాదు ముమ్మాటికీ కాదని చెప్పొచ్చు . 

వారికి ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని సౌకర్యాలకు ,మరియు  వారు దానిని ఒక దర్పంగా ,ఒక హోదాగా  , వారి మదిలో బలంగా నాటుకు పోతింది కాబట్టి ? వారు దానిలోంచి అంత తొందరగా బయటకు రాలేరు కాబట్టి , వారికి వెంటనే పదవి కావలి కాబట్టి , ఇతర పార్టీల వైపు తొంగి చూస్తూ ఉంటారు . అధికారంలో ఉన్నప్పుడు , మంది ,మార్బలం ,వాహనాలు వాటి వెంటా ,సెక్యూరిటీ గార్డులే  , కాకుండా ఫోన్ బిల్లు ,కారు బిల్లు ,ఇంటి బిల్లు ,వాటర్ బిల్లు ,ఇంటి మెటనెన్స్ కోసం ఖర్చులకు నగతుగా వారికి చెల్లించటం  మరియు ఆదికారికంగా విదేశీ ప్రయాణాలు ఎక్సట్రా ... ?

ప్రాంతాల వారీగా విడిది చెయ్యటానికి అన్ని సౌకర్యాలతో కూడిన భవనాలు , పార్ల మెంట్లో కానీ , అసెంబ్లీలో కానీ వారికి క్వాలిటీ ఫుడ్ , క్వాలిటీ టీ , క్వాలిటీ ఆఫీస్ రూమ్స్  ఇస్తే , వారు వెలగపెట్టేది , కాల పెట్టేది , అక్కడ ఉన్న మైకులు , బెంచీలు మరియు టేబుల్స్ . 

ఒక సభను నడిపించటం కోసం గంటకు కనీసం లక్ష ల  రూపాయల కొద్దీ ఖర్చు చేస్తుంటే మనం? , మనం పన్నులు కట్టుకుంటూ పోతే , వీరు వెలగపెట్టేది ఇది ! 

రాజకీయాన్ని ఒక చదువు గా , ఉద్యోగానికి ఎన్ని షరతులు ఉంటాయో ,మిలటరీలో ఎన్ని కస్టాలు ఉంటాయో ,ఒక IAS ,IPS కు ఎన్ని కండిషన్స్  ఉంటాయో ,అన్ని నియమాలు ఉన్న నాడు కానీ , ఉద్యోగానికి విధించే నియమాలు అన్ని, వారి పూర్వ చరిత్ర మరియు ముందు చరిత్ర  ను ( ఉద్యోగార్తి కి  క్రిమినల్ మరియు సివిల్ కేసులు ఉన్నాయా ? అని తెలుసుకొని వారికి ఉత్తమమైన ప్రవర్తన ఉంటేనే  ( certifay ) ఉద్యోగానికి అర్హుడుగా ప్రకటిస్తారు కాబట్టి , 

రాజకీయా నాయకులకు కూడా పైవి అన్నిషరతులు వర్తిస్తాయి అని లోగో పెట్టాలని కోరుకుందాం . 

జై   భారత్ మాత ! 

Friday, October 9, 2020

       అవసరమా  ?  ఈ  L R S   ( Layout Regularisation Scheme ) లు  కాదా  ?    

మధ్య తరగతి వారు ,దిగువ తరగతి వారు రూపాయి, రూపాయి కూడపెట్టి , కొన్ని సంవత్సరాలు  మొత్తం కష్ట పడి కూడపెట్టిన ప్రతి పైసా ను ,ఒక్క దగ్గరికి తెచ్చుకొని ,స్వంత ఇంటి కలను నెరవేర్చుకుందామనే ఆలోచనతో మున్సిపల్ అనుమతి లేకుండా ఉన్న ప్లాట్స్ ను అమాయకంగా  కొనుగోలు చేసుకున్న వారికి ఇది(LRS ) ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు . అయితే ఇక్కడ విషయం అది కాదు . 
DTCP అనుమతి లేకున్నా ఇంటి స్థలాలను కొన్నటువంటి వారు మోసపోయినట్టి వారే , ఆలాగే వారు కొన్నటువంటి ప్లాట్ వద్దకు నీటి ,మరియు మురుగు కాలువలు ఆదికారికంగా ఉండాలంటే, వారు ఆదికారికంగా చెల్లుపాటు అయినా ప్లాట్ లను కొనాలి కాబట్టి , జరిగిన తప్పుకు ,దిద్దుపాటు చేసుకోవటానికి ఈ(LRS ) అవకాశం మంచిది,సైరైనది కూడా . 
మరి ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకున్న వారు ధన్యులు , మరియు లీగల్ గా కూడా సపోటుగా ఉంటుంది . 
ఇక్కడ తప్పు ఎవ్వరిది రిజిస్టర్ దా  ? ప్రభుత్వాలదా ? లేక ప్రజలదా ? అందరిని తప్పుతోవ పట్టించిన రియల్ వ్యాపారులదా ? ఎవ్వరిది తప్పు ? 
ఈ తప్పులకు నష్ట పరిహారం ఎవ్వరు కట్టాలి  మరి ? ఎందుకు కట్టాలి మరి ? రియల్ వ్యాపారుల ? గౌర్నమెంట్ ఉద్యోగస్తులా ? కాదు , కాదు (?). ముమ్మాటికి సాధారణ ప్రజలదే కదా ? వినబడిందా ?